Thursday, May 16, 2024
- Advertisement -

పట్టిసీమ పంపింగ్‌లో ‘మేఘా’మరో రికార్డు..

- Advertisement -

పట్టిసీమ మరో రికార్డును అధిగమించింది. నిర్దేశించిన గడువులోగా ప్రాజెక్ట్‌ను పూర్తిచేసి లిమ్కాబుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో చోటుచేసుకున్న మేఘా ఇంజనీరింగ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లిమిటెడ్‌ (ఎంఈఐఎల్‌) తాజాగా ప్రాజెక్ట్‌ నిర్వాహణలోనూ మైల్‌స్టోన్‌ను అధిగమించింది. ఈ సీజన్‌లో బుధవారం (నవంబర్‌ 15) నాటికి నిరంతరాయంగా 148 రోజులు నీటిని పంపింగ్‌ చేసి అనతికాలంలోనే 100 టిఎంసీల నీటిని గోదావరి నుంచి కృష్ణాకు ఎత్తిపోతల ద్వారా మళ్లించి నదుల అనుసంధానంలో మరో రికార్డును సాధించింది. మొత్తం మీద మూడు సీజన్‌లలోనూ 159 టిఎంసీల నీటిని అందించగా గత ఏడాది (2016లో) 55.6 టిఎంసీలు, అంతకుముందు ఏడాది అంటే పట్టిసీమను ప్రారంభించిన సంవత్సరం 2015లో 4 టిఎంసీల నీటిని ఈ పథకం పంపింగ్‌ చేసింది. ఎత్తిపోతల పథకాలు సంక్లిష్టమైనవి అయినందున సాంకేతిక సమస్యలతో తరచూ మరమ్మత్తులకు గురవుతాయనే అభిప్రాయం బలంగా ఉన్న పరిస్థితుల్లో ఈ పథకం ఎటువంటి అంతరాయం లేకుండా ఇప్పటికీ ఒక లక్షా 20వేల గంటలు పనిచేసింది.

Megha Engineering & Infrastructures ltd.
Megha Engineering & Infrastructures ltd.

ఈ పథకంలోని 24 మోటార్లు నిరంతరాయంగా 148 రోజుల్లో 25,36,06,000 కిలోవాట్ల విద్యుత్‌ వినియోగం ద్వారా నిరంతరాయంగా 72వేల గంటల పాటు పనిచేసి ఎలెక్ట్రోమేకానికల్ రంగంలో ఈ సంస్థ తనకున్న నైపుణ్యాన్ని నిరూపించుకుంది. కృష్ణా నదికి పై నుంచి నీటి లభ్యత ప్రతి ఏడాది క్రమంగా తగ్గిపోతుండడంతో కృష్ణా డెల్టాను ఆదుకునేందుకు గోదావరి నీటి మళ్లింపే లక్ష్యంగా పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని మూడేళ్ల క్రితం పూర్తి చేయగా ఈ ఏడాది కృష్ణా డెల్టాకు అవసరమైన నీటిని మొత్తం గోదావరి నుంచే మళ్లించేందుకు ఈ పథకం ఎంతోగానో ఉపయోగపడింది. డెల్టాలోని మొత్తం ఆయకట్టుకు 13 లక్షల ఎకరాలకు నీరందించింది.

Megha Engineering & Infrastructures ltd.
Megha Engineering & Infrastructures ltd.

దేశం మొత్తంమీదనే నిర్దేశించిన గడువులోగా బడ్జెట్‌ అంచనాల పెంపుదల లేకుండా పూర్తిచేసిన తొలి ప్రాజెక్ట్‌ ఇదే. ఎన్ని అవాంతరాలు ఎదురైనా మేఘా ఇంజనీరింగ్‌ కంపెనీ దీనిని ఒక సవాలుగా తీసుకొని 2000 వేల మంది సిబ్బందితో రాత్రింబవళ్లు పనిచేసి, నిర్దేశించిన గడువుకంటే ముందుగానే ఈ ప్రాజెక్ట్‌ను పూర్తి చేసింది. ప్రాజెక్ట్‌ నిర్మాణాన్ని చేపట్టిన 173 రోజులలో (సెప్టెంబర్‌ 18, 2015న) తొలి పంప్‌నుంచి నీటిని విడుదల చేసింది. పట్టిసీమ ప్రాజెక్ట్‌ను 30 మార్చి 2015న నిర్మాణం చేపట్టిన ఎంఈఐఎల్‌ ఏడాదికంటే ముందుగానే అంటే 2016 మార్చి 20 న పూర్తి చేసింది. తద్వారా ఎంఈఐఎల్‌ లిమ్కా బుక్‌లో రికార్డుగా నమోదు సాధించుకుంది. సముద్ర మట్టం కంటే దిగువన డయాఫ్రం వాల్‌ వంటి అత్యంత క్లిష్టమైన కాంక్రీట్‌ నిర్మాణాలను పూర్తి స్థాయి దేశీయ పరిజ్ఞానంతో నిర్మించింది.

Megha Engineering & Infrastructures ltd.
Megha Engineering & Infrastructures ltd.

7476 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉన్న 24 పంప్‌లతో కూడిన పట్టిసీమ ప్రాజెక్ట్‌ ఏసియాలోనే అతిపెద్దది. ఇరిగేషన్‌ రంగానికి సంబంధించి మనదేశంలోనే తొలి ప్రాజెక్ట్‌గా రికార్డులకెక్కిన పట్టిసీమను పూర్తిచేసిన ఘనత ఎంఈఐఎల్‌దే. పట్టిసీమ ప్రాజెక్ట్‌.

Megha Engineering & Infrastructures ltd.
Megha Engineering & Infrastructures ltd.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -