Friday, April 26, 2024
- Advertisement -

విడాకులు తీసుకున్నానని వాళ్ళు నన్ను దూరం పెట్టేశారు!

- Advertisement -

క్రియేటివ్ డైరెక్టర్ కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన “దేవి “సినిమాతో తెలుగు తెరకు హీరోయిన్ గా పరిచయమైన వనిత తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకుంది. హీరోయిన్ వనిత అలనాటి ప్రముఖ నటి మంజుల పెద్ద కూతురు. మంజూల తమిళ నటుడు విజయ్ కుమార్‌ను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. వీరికి ముగ్గురు కూతుళ్లు. వారిలో పెద్ద కూతురే వనితా విజయ్ కుమార్. ఈమె తమిళలో హీరోయిన్ గా రాణించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇటీవలే ఆమె మూడో పెళ్లి చేసుకొని హాట్ టాపిక్‌గా మారీ సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న విషయం తెలిసిందే.

తాజాగా నటి వనితా విజయ్ కుమార్ తన వైవాహిక జీవితంలో ఎదుర్కొన్న కష్టాలను, సమస్యలను చవిచూసిన చేదు నిజాలను ఓ ఇంటర్వ్యూలో అభిమానులతో పంచుకున్నారు.తానుమూడు పెళ్లిళ్లు చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. కారణాలు మాత్రం ఎవరికీ తెలియదు అంటూ నాకు 18 సంవత్సరాల వయసు ఉన్నప్పుడే వివాహం చేసేశారు. అప్పట్లో అసలు జీవితమంటే ఏమిటో నాకు తెలీదు.దాంతో నా భర్తతో ఎన్నోసార్లు గొడవలు జరిగాయి.ఆ బాధను తట్టుకోలేక చాలాసార్లు పుట్టింటికి వచ్చేశాను. చివరికి చేసేది లేక విడాకులు తీసుకున్నాను. నా వైవాహిక జీవితం విఫలమవడానికి నా తల్లిదండ్రులు కూడా కారణమనే చెప్పాలి.

Also read:హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వనున్న మరో వారసురాలు.. ఎవరంటే?

నిజం చెప్పాలంటే నాకు నా కుటుంబం నుంచి ఎటువంటి సపోర్ట్‌ లేదు. ఒకవేళ వాళ్లే కనుక నాకు తోడుగా ఉంటే నా జీవితం మరోలా ఉండేదని,ఏది ఏమైనా దేవుడి దయ వల్లే నేను ఈ స్థాయికి రాగలిగాను. జీవితంలో తగిలిన ఎదురుదెబ్బల వల్లే ఎన్నో కష్టాలను సమర్థవంతంగా ఎదుర్కొన్నాను అని వనితా విజయ్‌కుమార్‌ భావోద్వేగానికి లోనయ్యారు.

Also read:స్టుపిడ్స్‌కు అలానే జరుగుతుంది.. వైరల్ గా మారిన రాశీ ఖన్నా పోస్ట్!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -