Sunday, May 4, 2025
- Advertisement -

కొత్త రూ.250 నోటు రాబోతుంది ఎప్పుడో తెలుసా?

- Advertisement -
new 250 rupies note details

దేశంలో పెద్ద నోట్ల రద్దు తో జనాలు బాగా ఇబ్బందులు పడుతున్నారు. చిల్లర దొరకాక.. చాలా ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు. అయితే ఈ పెద్ద నోట్ల రద్దు తర్వాత వస్తున్న వార్తలు ప్రజలను మ‌రింత క‌న్‌ఫ్యూజ‌న్‌కు గురి చేస్తున్నాయి. నోట్ల రద్దు తర్వాత కొత్తగా రూ.2 వేల నోటుతో పాటు కొత్త‌గా రూ.500 నోటు ప్ర‌వేశ‌పెట్టారు. దేశ‌వ్యాప్తంగా ఇంకా ఈ కొత్త నోట్ల గంద‌ర‌గోళం కొన‌సాగుతూనే ఉంది. ఇదిలా ఉండ‌గానే ఇపుడు వచ్చిన వార్త మరింత షాక్ కలిగించేది ఉంది.

త్వరలో రూ.2వేల నోటు రద్దు అవుతుంద‌ని తెలుస్తోంది. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ ఎస్ ఎస్) సిద్ధాంతకర్త – ఆర్థిక నిపుణుడు ఎస్ గురుమూర్తి ఈ షాకింగ్ న్యూస్ వెల్ల‌డించారు. చిన్న నోట్లతో పాటు పెద్ద నోటు కూడా రద్దు అయ్యే అవకాశం ఉందన్నారు. రూ. 2 వేల నోటు ర‌ద్దు వ‌చ్చే ఐదేళ్ల‌లో ఎప్పుడైనా ర‌ద్దు అవుతుంద‌ని ఆయ‌న అన్నారు. ఈ నోటు ర‌ద్దుతో దేశంలో రూ. 500 నోటే అతి పెద్ద నోటుగా చెలామణి అవుతుందని ఆయ‌న జోస్యం చెప్పారు.

కొత్తగా రూ. 250 నోటు – రూ. 100 నోటును ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. ఇక వెయ్యి నోటు అయితే శాశ్వతంగా రద్దు కానుందని గురుమూర్తి తెలిపారు. నల్లధనం – అవినీతిని నిర్మూలించేందుకే ప్రధాని మోడీ గత నవంబర్ 8న పెద్ద నోట్లను రద్దుచేశారని పేర్కొన్నారు. ప్రస్తుత ఆర్థిక అవసరాలు తీర్చేందుకే రూ.2000 నోటు తీసుకువచ్చారని త్వరలో వాటిని రద్దు చేయడం ఖాయ‌మ‌ని ఆయ‌న చెప్పారు.

Related

  1. 2వేల నోటు సీక్రెట్ బయట పెట్టిన కేసీఆర్!
  2. 2000 నోటుని పరిశీలిస్తున్న పవన్!
  3. 2000 నోటు నకిలీనోటు అవునో కాదో ఇలా గుర్తించండి!
  4. 2000 నోటు వెనకాల పెద్ద మాస్టర్ ప్లాన్ నడిచింది

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -