రైయ్ రైయ్ మంటూ పరుగులు తీస్తున్న నేటి బీజీ బీజీ లైఫ్‌లో ఎక్కువగా జనాలు నైట్‌లైఫ్‌ను ఇష్టపడుతున్నారు. ఈ క్రమంలోనే సరిగ్గా నిద్ర పోవడం లేదు. అయితే, సరిగ్గా నిద్ర పోవడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు వస్తాయని ఇప్పిటికే పలు అధ్యయనాలు వెల్లడించాయి. అయితే, శరీరంలో అన్నింటిని నియంత్రణలో ఉంచే మెదడు పనితీరు మెరుగ్గా ఉండాలంటే రాత్రిళ్లు సుఖమైన నిద్ర పోవాలని తాజాగా ఓ అధ్యయనం తేల్చింది.
నార్త్ వెస్టర్న్ యూనివర్సిటీ జరిపిన ఈ పరిశోధనలో కీలక అంశాలను ప్రస్తావించింది. మెదడు పనితీరు బాగుండాలి అంటే సరిపడ నిద్ర అవసరం అని తెలిపింది. మరీ ముఖ్యంగా రాత్రిళ్లు సుఖమైన, ధీర్ఘమైన నిద్ర మెదడు పనితీరును మెరుగ్గా చేస్తుందని వెల్లడించింది. నిద్రవల్ల మెదడులోని మలినాలు, పూషపూరితంగా మారి ప్రభావం చూపే ప్రోటీన్లు తగ్గిపోతాయని ఈ అధ్యయనం స్పష్టం చేసింది.
సుఖమైన రాత్రి నిద్ర శరీరంలో నరాల పనితీరును మెరుగుపరుస్తుందని అధ్యయనం పేర్కొంది. నరాల వ్యాధులు కూడా రాకుండా ఉంటాయని స్పష్టం చేసింది. కాబట్టి అందరూ సుఖమైన నిద్ర రావడానికి రాత్రిళ్లు మంచంపై ఫోన్లు, టీవీలు, ల్యాప్‌టాప్ వంటి ఎలక్ట్రానికి వస్తువులను వినియోగించకూడదు. అలాగే, ప్రతి ఉదయం కొంత దూరం నడవటం, వ్యాయామం చేయాలి. పడుకునే ముందు ఆహారం తక్కువగా తీసుకోవాలి. అలాగే, పాలు తాగడం వల్ల కూడా నిద్ర బాగా పడుతుంది.
15యేళ్ల తర్వాత మెగాస్టార్ కు జోడిగా ఆ ముద్దుగుమ్మ!
మిస్సెస్ ఇండియా పోటీల్లో సత్తా చాటిన తెలుగు యువతి !
ఎన్టీఆర్ తో తలబడుతున్న విజయ్ సేతుపతి !
ప్రియుడితో చిందేస్తున్న శృతి హాసన్