Tuesday, April 16, 2024
- Advertisement -

నిద్ర సరిగా పట్టకపోతే ఏం చేయాలి..?

- Advertisement -

నిద్ర మనలోని స్ట్రెస్ ను తగ్గిస్తుంది. ఆరోగ్యకరమైన జీవితం కోసం నిద్ర అత్యంత అవసరం. అయితే చాలా మంది తమకు రాత్రిపూట సరిగ్గా నిద్రపట్టడంలేదు అని కంప్లెయింట్స్ చేస్తుంటారు. అలాంటి వారి కోసం కొన్ని చిట్కాలు.

శరీరంలో వాతం పెరిగితే నిద్ర పట్టక పోవచ్చు. మీరు దేశవాళీ ఆవు నెయ్యిని పడుకునే ముందు రెండు చుక్కలు రెండు ముక్కు రంధ్రాల్లో వేసుకుని పడుకోండి. మంచి నిద్ర పడుతుంది. గురక తగ్గుతుంది, కలలురావు , పిల్లలకు ఇలా చేస్తే మంచి జ్ఞాపక శక్తి పెరుగుతుంది.

అధిక రక్తపోటు ఉన్నా వారుకి సరిగా నిద్ర పట్టక పోవచ్చు. ఇలాంటి వారికి రక్తంలో ఆమ్లాలు పెరగటం వలన రక్తపోటు వస్తుంది. మీరు క్షార పదార్ధమైన మెంతులు , క్యారెట్ , ఇంకా ఆపిల్ , జామపండు , అరటికాయ, ఇలా రసంలేని పండ్లలో క్షారగుణం వుంటుంది. ఇవి తీసుకోవాలి. ఆకుకూరల్లో పాలకూర , బంగాళదుంప క్షారము కాదు. ఆమ్లముకాదు. ఇది మధ్య స్ధితి కలిగినది. ఇలా క్షారగుణం కలిగిన పదార్ధాలను తీసుకుంటే మీ బ్లడ్ ప్రెజర్ తగ్గుతుంది. స్ధూలకాయం తగ్గుతుంది. సొరకాయ లో ఎక్కువ క్షారగుణం ఉన్నది. దీనిని పచ్చిగా కూడా తీసుకోవచ్చును , రసం త్రాగవచ్చును. ఇది చాలా మంచిది.

ఆస్తమా ఉన్నా వారుకి సరిగా నిద్ర పట్టక పోవచ్చు. ఆస్తమా ఇది వాయు ప్రకోపంవల్ల వచ్చేది. దీనికి దాల్చిన చెక్కను తేనెతో కలిపి తీసుకోవాలి. రసం ఉండికూడా క్షారగుణం కలిగిన ఒకే ఒక కాయ కొబ్బరి కాయ. ఆస్తమా + ఉబ్బసం ఉన్న వారు క్రమం తప్పకుండా పచ్చి కొబ్బరి కాయను తినండి. పచ్చి కొబ్బరిని రోజు 50 గ్రాముల వరకు బాగా నమిలి నమిలి తినాలి. ఇలా తింటే 3 నెలల్లో మీ ఆస్తమా + ఉబ్బసం తగ్గి పోతాయి.

నోటిలో బొబ్బలు ఉన్నా వారుకి సరిగా నిద్ర పట్టక పోవచ్చు. నోటిలో బొబ్బలు మీ కడుపులో మలినాలు ఉంటే వస్తాయి. దీనికి ఉదయాన్నే నీళ్ళు సిప్ సిప్ చేసి త్రాగుతుంటే తగ్గిపోతాయి.

Also Read: నటన వారిది… గాత్రం వీదిరి…!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -