Thursday, April 18, 2024
- Advertisement -

ఎన్టీఆర్ తో త‌ల‌బ‌డుతున్న విజ‌య్ సేతుపతి !

- Advertisement -

డైరెక్ట‌ర్ త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌, యంగ్‌టైగర్‌ ఎన్టీఆర్ తో ఒక సినిమా చేయ‌బోతున్నార‌న్న విష‌యం మ‌న‌కు తెలిసిందే.. ఇప్పుడు ఆర్‌ఆర్‌ఆర్ సినిమాలో ఎన్టీఆర్ బిజీగా ఉన్నాడు. ఈ సినిమా త‌ర్వాత త్రివిక్ర‌మ్ తోను సినిమా చేయనున్నార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. అయితే ఆ సినిమా ప్రారంభానికి ముందే దీని గురించి ఒక ఆస‌క్తి క‌ర విష‌యం వినిపిస్తోంఇ.

ఈ సినిమాలో ఎవ‌రెవ‌రు న‌టిస్తున్నారో ఇంకా తెలియ‌దు కానీ.. ఇందులో యాక్ట్ చేస్తున్న విల‌న్ గురించే ఇప్పుడు చ‌ర్చంత‌. ఈ సినిమాలో విల‌న్ గా బాలీవుడ్‌ నటుడు సునిల్‌ శెట్టి నటిస్తున్నారన్న న్యూస్ వ‌చ్చింది. కానీ ఇప్పుడు మ‌రో వార్త ఆస‌క్తిక‌రంగా క‌నిపిస్తోంది. ఇప్పుడ విలన్‌పాత్రలకు కేరాఫ్‌గా నిలుస్తూ అలరిస్తున్న విజయ్‌సేతుపతి.. ఇందులో యాక్ట్ చేయ‌నున్నార‌ని.

విజయ్ సేతుపతి విలన్‌గా కనిపించిన ‘మాస్టర్‌’, ‘ఉప్పెన’ ఇండ‌స్ట్రీలో మంచి హిట్లు కొట్టాయి. దీంతో విజయ్‌ తెలుగు ప్రేక్షకులకు ఎంతో ద‌గ్గ‌ర‌య్యార‌ని చెప్పాలి. దీనికి తోడు త్రివిక్ర‌మ్ మంచి ఫాంలో ఉన్నారు. ఇక సినిమా కూడా ఆ రెంజ్ లోనే ఉంటుందని ప‌లువురు చెబుతున్నారు. అయితే ఈ సారి విల‌న్ గా విజ‌య్ ను త్రివిక్ర‌మ్ త‌న సినిమాలో చూపించ‌నున్నాడ‌ని అంద‌రు అనుకుంటున్నారు.

ప్రేమలో ప‌డ్డ సాయి ప‌ల్లవి !

ఉప్పెన’ గురించి సూప‌ర్ స్టార్ మ‌హేష్ ఏమ‌న్నాడో తెలుసా?

రోజాతో ఆ కోరిక మిగిలిందంటున్న అల్ల‌రి న‌రేష్ !

ట్రాన్స్ జెండ‌ర్ గా విజ‌య్ సేతుప‌తి !

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -