ఒకో ఒక్కడు సినిమా గురించి అందరికీ తెలిసే ఉంటుంది.అందులో అర్జున్ ఒక రోజు ముఖ్యమంత్రిగా భాద్యతలు చేపట్టారు అది సినిమాలో..మరి అలాంటి సంఘటన నిజజీవితంలో చోటు చేసుకుంది.
ఒక రోజు ముఖ్యమంత్రి అని ఆశ్చర్య పోతున్నారా…! అవును మీరు విన్నది నిజమే.కెనడా దేశానికి ప్రధానమంత్రిగా ఐదేళ్ల చిన్నారి త్వరలోనే బాధ్యతలు చేపట్టనుంది.
అసలు విషయానికి వస్తే కెనడాకు చెందిన సీబీసీ కిడ్స్ ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్‌లో భాగంగా ఇటీవల ఓ కాంటెస్ట్ నిర్వహించింది. ‘పీఎం ఫర్ ఏ డే(ఒకరోజు ప్రధాని)’ పేరుతో జరిపిన ఈ కాంటెస్ట్‌లో థంప్సన్‌కు చెందిన ఐదేళ్ల చిన్నారి బెల్లా విజయం సాధించింది. ఇంకేముంది దేశానికి ఒక రోజు ప్రధానిగా బెల్లా పనిచేయనుంది. కెనడా డే స్పెషల్ జులై 1న బెల్లా ప్రధానిగా కన్పించనుంది.
{loadmodule mod_custom,Side Ad 1}
ఒట్టావాలోని పార్లమెంట్ కార్యాయంలో బెల్లాను కలిసిన ప్రధాని ట్రూడో.. ఆమెను అభినందించారు. అంతేగాక, బెల్లాతో కలిసి చిన్నపిల్లాడిలా మారిపోయి కాసేపు ఆడుకున్నారు.ఇంతకి బెల్లా ఏంచెప్పిందో తెలుసా…‘ఒక ప్రధానిగా.. పత్రిఒక్కరికీ ఇల్లు ఉండేలా, అందరూ సురక్షితంగా ఉండేలా చూస్తాను. ప్రతి ఒక్కరినీ నేను ఆప్యాయంగా ఆలింగనం చేసుకుంటాను. మన చుట్టూ ఉండే జంతువులు, ప్రపంచం క్షేమంగా ఉండేలా పనిచేస్తాను. ప్రతి కెనడియన్ ఆరోగ్యంగా ఉండేలా చూస్తాను’ అని చెప్పిందట కాబోయే ఈ బుల్లి ప్రధాని.
{loadmodule mod_sp_social,Follow Us}
Also Read