Tuesday, April 30, 2024
- Advertisement -

బ్రిటన్ ప్రధానిగా రిషి సునాక్.. ఆ పదవిలో తొలి భారత సంతతి వ్యక్తిగా రికార్డ్ !

- Advertisement -

ఈ మద్య కాలంలో బ్రిటన్ లో వెల్లువెత్తిన రాజకీయ సంక్షోభం యావత్ ప్రపంచ దేశాలను ఆకర్షించింది. ఆ మద్య బ్రిటన్ ప్రధానిగా ఉన్న బోరిస్ జాన్సన్ పై కుంభకోణాల ఆరోపణలు రావడంతో.. ఆయన పార్టీ నుంచే బోరిస్ కు వ్యతిరేకత ఎదురైంది. దాంతో తప్పని పరిస్థితుల్లో బోరిస్ జాన్సన్ తన ప్రధాని పదవికి రాజీనామా చేశాడు. ఆ తరువాత ప్రధాని పదవి కోసం ఎన్నికల రేస్ లో కంజర్వేటివ్ పార్టీ నుంచి భారత సంతతికి చెందిన రిషి సునాక్, లీజ్ ట్రస్ పోటీలో నిలిచారు. అయితే మొదటి నుంచి రిషి సునాక్ పేరు గట్టిగా వినిపించినప్పటికి అనూహ్యంగా లీజ్ ట్రస్ ఎన్నికల్లో గెలుపొంది.. బ్రిటన్ ప్రధాని పదవికి ఎన్నికయ్యారు. అయితే లీజ్ ట్రస్ ప్రవేశపెట్టిన మినీ బడ్జెట్ పై తీవ్రమైన వ్యతిరేకత ఏర్పడడంతో ఎవ్వరూ ఊహించని విధంగా ప్రధాని పదవి నుంచి తప్పుకున్నారు.

ఫలితంగా బ్రిటన్ చరిత్రలోనే అత్యంత తక్కువకాలం ( 45 రోజులు ) ప్రధానిగా కొనసాగిన మహిళగా లీజ్ ట్రస్ రికార్డుల్లో నిలిచారు. ఇక తరువాతి బ్రిటన్ ప్రధాని ఎవరనే దానిపై ఈ మద్య జోరుగా చర్చ జరిగింది. అయితే ముందు నుంచి ప్రధాని రేస్ లో ఉన్న రిషి సునాక్ బ్రిటన్ ప్రధానిగా ఎన్నికయ్యే అవకాశం ఉందని వార్తలు బలంగానే వచ్చాయి. ఇక ఆ వార్తలను నిజం చేస్తూ కంజర్వేటివ్ పార్టీ నుంచి రిషి సునాక్ ను బ్రిటన్ ప్రధానిగా ఎన్నుకున్నట్లు తెలుస్తోంది. దీంతో బ్రిటన్ చరిత్రలోనే తొలిస్వదేసేతర ప్రధాన మంత్రిగా రిషి సునాక్ నిలిచాడు. ఇక 200 సంవత్సరాలు మనదేశాన్ని పరిపాలించిన బ్రిటిష్ వారిదేశానికి.. మన భారత సంతతికి చెందిన రిషి సునాక్ ప్రధానిగా ఎన్నిక కావడం నిజంగా గర్వకారణం..మరి తీవ్ర రాజకీయ సంక్షోభంతో కొట్టిమిట్టాడుతున్న బ్రిటన్ ను.. రిషి ఎలా గాడిలో పెదతరో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -