Sunday, May 5, 2024
- Advertisement -

వే ప్రొటీన్ అవసరం గుర్తించండి

- Advertisement -

బలమైన పోషకాలు లేక నీరసించి పోతోన్న కుర్రాళ్లకు ‘వే- ప్రొటీన్‌’ అవసరం ఇప్పుడు బాగా ఏర్పడింది. ఈ ప్రొటీన్‌ను ఆవు పాలలోంచి, పాల మీగడలోంచి తయారు చేస్తారు. ఇది మన ఆరోగ్యంపై ఎంతో ప్రభావాన్ని చూపడం వలన… ఎక్కువ మంది దృష్టి ఈ ప్రొటీన్‌ మీదికి పోతోంది. ఇది పొడి రూపంలోనూ, కాన్‌సెంట్రేట్‌, ఐసొలేట్‌గా లభిస్తోంది. చాలా పౌష్టికరమైన ఈ ప్రొటీన్‌ అతి తేలిగ్గా సులభంగా జీర్ణమైపోవడం ఇందులో చెపుకోదగిన విశేషం.

మన శరీరంలో ప్రొటీన్‌ తయారు కావడానికి దోహదం చేసే అమినో ఆసిడ్స్‌ను కూడా వే-ప్రొటీన్‌ కావలసిన మోతాదులో అందచేస్తుంది. నిజానికి కూరగాయల్లోంచి లభించే ప్రొటీన్‌ శరీర అవసరాలకు ఏవిధంగాను సరిపోదు. దానికి ప్రధాన కారణం…. మన శరీరానికి అవసరమైన ఎసెన్షియల్‌ అమినో ఆసిడ్స్‌ అందులో లేకపోవడమే. శరీరానికి అవసరమైన పూర్తి స్థాయి ప్రయోజనం చూకూరాలంటే …. వే-ప్రొటీన్‌తో పాటు ఎగ్‌ ప్రొటీన్‌, సోయా ప్రొటీన్‌, వీట్‌ ప్రొటీన్‌ కూడా తీసుకోవలసి ఉంటుంది.

అలా చేస్తేనే శరీరానికి సమగ్రపోషణ లభ్యమవుతుంది. వే- ప్రొటీన్‌ సింథసిస్ ను పెంచడం వలన… కండరాల్లో కొత్త కణజాలం పుట్టడానికి కారణమవుతుంది. శరీర బరువును ఆదారంగా చేసుకుని 1 కె .జి శరీరం బరువుకు 1.2 వే ప్రొటీన్‌ తీసుకుంటే, మజుల్‌ మాస్‌ గణ నీయంగా పెరుగుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. బెవరేజ్‌ సప్లిమెంటేషన్‌ ద్వారా లభించేదాని కంటే…. ఇది ఎన్నో రెట్లు ఎక్కువ. బాడీ బిల్డర్స్‌, విపరీతంగా వ్యాయామం చేసే వారికే అని కాకుండా …శరీరంలో నిస్సత్తువతో అంత యాక్టిగ్ గా లేనివారికి, వయసు పైబడటం వల్ల జరిగే కండరాల క్షీణతను అరికట్టడంలోనూ ఈ వే- ప్రొటీన్‌ చాలా యూజ్ అవుతుంది. ఎవరి మీదా ఆధారపడకుండా, ఒక ప్రామాణిక జీవితాన్ని గడపడానికి వే- ప్రొటీన్‌ తోడ్పడుతుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -