స్మార్ట్ ఫోన్‌ల తయారీలో దూసుకు పోతున్న దక్షిణకొరియా దిగ్గజం శామ్ సంగ్‌నుంచి అత్యాధునికి పీచర్లతో మరో కొత్త పోన్ రాబోతోంది.ఎంట్రీ లెవల్ లో జెడ్ 4 స్మార్ట్ ఫోన్ ను లాంచ్ చేసేందుకు రంగం సిద్ధం చేసింది.
ఎవరైతే ఫీచర్ ఫోన్ నుంచి సోషల్ మీడియా, ఇంటర్నెట్, డేటా కనెక్షన్ ఎక్స్ పీరియన్స్ కోసం వేచిచూస్తున్నారో వారి కోసం ప్రత్యేకంగా ఈ ఫోన్ ను శాంసంగ్ తీసుకొస్తోంది.
మొదట చైనా మార్కెట్‌లో లాంచ్ చేసే కంపెనీ ఈసారి మొదటి సారిగా భారత్ వినియోగదారులకే అందుబాటులోకి తీసుకురానున్నట్టు తెలిసింది. ఈ కొత్త మొబైల్ బ్లాక్, సిల్వర్, గోల్డ్ రంగుల్లో ఇది వినియోగదారులను అలరించనుంది.దాని ధర ఎంతో ఇప్పటి వరకు కంపెనీ ప్రకటించలేదు.
{loadmodule mod_custom,Side Ad 1}
శాంసంగ్ తీసుకురాబోతున్న ఈ ఎంట్రీ లెవల్ జెడ్4 స్మార్ట్ ఫోన్ ఫీచర్లు
4 అంగుళాల డబ్ల్యూవీజీఏ డిస్ ప్లే
1జీబీ ర్యామ్
8జీబీ ఇంటర్నెల్ స్టోరేజ్ ప్రొవిజన్
మైక్రో ఎస్డీకార్డు ద్వారా 128జీబీ వరకు విస్తరణ
400×800 పిక్సెల్స్ రెజుల్యూషన్
2.5డీ కర్వ్డ్ గ్లాస్
143 గ్రాముల బరువు
క్వాడ్ కోర్ ప్రాసెసర్
శాంసంగ్ టిజెన్ ఓఎస్ వెర్షన్ 3.0
4జీ ఎల్టీఈ
2050ఎంఏహెచ్ బ్యాటరీ
5ఎంపీ రియర్, ఫ్రంట్ కెమరా
డ్యూయల్ ఎల్ఈడీ ఫ్లాష్
కొత్తగా వస్తున్న ఈ స్మార్ట్ పోన్ వినియేగ దారులను ఎంత వరకు అకట్టుకుంటోందో చూడాలి.
{loadmodule mod_sp_social,Follow Us}
Also Read