Sunday, May 19, 2024
- Advertisement -

“రాగం” సింగర్ సునిత నిజజీవితమేనా?

- Advertisement -

దర్శకులు ఒక కథ రాసుకున్నప్పుడు కొన్ని నిజజీవితం లో ఉన్న సంఘటనలని ఆ కథలో భాగం చేయటం కొత్తేమి కాదు. కొన్ని సార్లు తమ సొంత జీవితాన్నే మెయిన్ పాయింట్ గా తీసుకోని సినిమాలు తీస్తుంటారు. అయితే ఈ మధ్య సింగర్ సునీత చేసిన షార్ట్ ఫిలిం రాగం విషయం లో కూడా ఇదే విషయం లో వినిపిస్తున్న వార్తలు “రాగం” వైపు అందర్నీ లాగుతున్నాయి.

ఒక ఒంటరి మహిళ గా తన కష్టాలనీ, తాను వైవాహిక జీవితం లో ఎదుర్కొన్న సమస్యలనీ ఆమధ్య మీడియా ముందుంచిన సునిత…. ఆ ఇంటర్వ్యూ తర్వాత చేసిన మొదటి షార్ట్ ఫిలిం ఇదే కావటం తో కొంత ఆసక్తి నెలకొంది.. ”రాగం” అనే షార్టు ఫిలింలో సునీత తొలిసారిగా ముఖానికి మేకప్ వేసుకుని యాక్టింగ్ టాలెంట్ చూపించింది. ఇన్నాళ్లూ ఎంతమంది దర్శకులు నటించమని అడిగినా కూడా నో చెప్పేసిన సునీత.. ఇప్పుడు మాత్రం ఎందుకు ఒప్పుకుంది? అందుకే ఆ కథే కారణం అని చెప్పాలేమో.

‘బాసుతో క్లోజ్ గా ఉందిలే’ అంటూ కామెంట్లు చేసే సహోద్యోగులు.. ఇలాంటివారితో చాలా ఇబ్బందులే పడుతుంటారు. పోనివ్ లే అని వదిలేయలేం.. అలాగని పట్టించుకుంటే మనకు ఇంకా నరకంగా ఉంటుంది. సరిగ్గా అలాంటి ఓ ఒంటరి మహిళ కథే ఈ షార్ట్ ఫిలిం. అయితే దగ్గరగా చూస్తే.. నిజానికి ఆరేళ్ల నుండి తన భర్త నుండి విడిపోయి ఒంటరిగా తన తల్లిదండ్రులు అండ్ పిల్లలతో కలసి జీవిస్తున్న రియల్ లైఫ్ కూడా కాస్త ఇలాంటి వాస్తవానికి దగ్గరగానే ఉందనేది చెప్పడానికే సునీత ఈ ఫిలిం చేసిందా అనే సందేహం.. ఈ మధ్య కాలంలో ఆమె ఇంటర్యూలను చదువుతున్నవారందరికీ వస్తోంది.

{youtube}n4iFqBA13oQ{/youtube}

Related

  1. ఎఫైర్‌పై సింగ‌ర్ సునీత కామెంట్‌
  2. షాకింగ్ : పవన్ కళ్యాణ్ తో సింగర్ సునీత
  3. పవన్‌ కళ్యాణ్‌కు పిన్నిగా కాదు అత్తగా సింగర్ సునీత!
  4. సొంత భర్త ని రేప్ చేసిన భార్య!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -