Friday, April 19, 2024
- Advertisement -

తెలుగు తెరపై కన్నడ భామలు.. తెలుగోళ్ల మనసు దోచిన భామలు వీళ్ళే!

- Advertisement -

తెలుగు ఇండస్ట్రీలో తెలుగు వారు కాకుండా ముంబై భామాల హవా కొనసాగుతుంది. ఆ తర్వాత మలయాళ బ్యూటీలు ఆ తరువాత బెంగళూరు భామలదే హవా కొనసాగుతుంది. కానీ తెలుగు ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో ఎక్కువగా శాండిల్ వుడ్ నుంచి వచ్చిన వారి హవా ఎక్కువగా కొనసాగుతుంది. ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో దాదాపు అరడజనుకు పైగా శాండిల్ వుడ్ భామల హవా కొనసాగిస్తున్నారు. మరి ఆ చందన పరిమళాలు ఎవరో ఇక్కడ తెలుసుకుందాం..

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా కొనసాగుతున్న రష్మిక మందన చలో సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైన ఈమె గీత గోవిందం, సరిలేరు నీకెవ్వరు, భీష్మ వంటి వరుస విజయాలను సొంతం చేసుకుంది. ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పుష్ప సినిమాలో నటిస్తున్నారు. అదేవిధంగా మెగా హీరోతో జత కట్టి మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకున్న కృతి శెట్టి ప్రస్తుతం తెలుగులో ఎంతో బిజీగానే ఉన్నారు.

Also read:ఆ సంఘటన చూసి షాక్.. మందుబాబుల పై సింగర్ సునీత షాకింగ్ రియాక్షన్

కెరీర్‌లో తొలి అడుగులు వేస్తున్న శ్రీ లీల సైతం రెండు క్రేజీ ప్రాజెక్ట్స్‌ను సొంతం చేసుకున్నారు.. ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ వంటి హిట్‌ సినిమాలను తన ఖాతాలో వేసుకున్న నభ నటేష్ మాతృభాష కూడా కన్నడనే. జెర్సీ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన మరో కన్నడ బ్యూటీ  శ్రద్ధా శ్రీనాథ్‌. ప్రస్తుతం ‘యాత్ర’ ఫేమ్‌ మహివి రాఘవ్‌ దర్శకత్వంలో ఓ లేడీ ఓరియంటెడ్‌ సినిమా చేస్తున్నారు. కన్నడలో ఎంతో పాపులారిటీ సంపాదించుకున్న రచితా రామ్‌ తెలుగులో మెగా అల్లుడు కళ్యాణ్ సరసన నటించిన సూపర్ మచ్చి ద్వారా తెలుగు ఎంట్రీ ఇవ్వనున్నారు.

Also read:పిల్లల్ని హత్తుకొని ఎమోషనల్ అయిన అల్లు అర్జున్..ఎందుకంటే?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -