Thursday, March 28, 2024
- Advertisement -

హైదరాబాద్ తడిసి ముద్దయ్యింది..

- Advertisement -

హైదరాబాద్ తడిసి ముద్దయ్యింది.. ఈదురుగాలులు, ఉరుములు, మెరుపుల‌తో భారీ వ‌ర్షం కురుస్తోంది. సాయంత్రం 4 గంటల ప్రాంతంలో భారీగా గాలులు వీచాయి. అనంతరం..భారీ వర్షం కురిసింది. అప్పటి వరకు ఉక్కపోతతో అల్లాడిన జనాలు..చల్లటి వాతావరణానికి ఊపిరిపీల్చుకున్నారు. ఎల్బీ నగర్, తార్నాక, హయత్ నగర్, నాగోలు, వనస్థలిపురం, కూకట్ పల్లి ప్రాంతాల్లో వర్షపాతం నమోదైంది.

భారీ ఈదురుగాలులు వీస్తుండ‌టంతో క‌రెంట్ స‌ర‌ఫ‌రాకు అంత‌రాయం ఏర్ప‌డింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా అక్క‌డ‌క్క‌డ వ‌ర్షాలు కురుస్తున్నాయి. అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం ఈ ఉదయం వాయుగుండంగా మారింది.

మధ్యప్రదేశ్ నుంచి విదర్భ, తెలంగాణ మీదుగా తమిళనాడులోని పలు ప్రాంతాల మీదుగా గాలుల్లో అస్థిరత వల్ల నేడు, రేపు కూడా తెలంగాణలో ఉరుములు, మెరుపులతో వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది.

అఫ్గానిస్థాన్ లో ఘోరం..రంజాన్ వేళ మసీదుపై బాంబు దాడి

రెండు భాగాలు.. సినిమా హిట్ పక్క?

రఘురామకృష్ణరాజుని అరెస్ట్ చేసిన ఏపీ సీఐడీ అధికారులు!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -