Monday, April 29, 2024
- Advertisement -

టీడీపీ ,జనసేనతో బీజేపీ పొత్తు… 2014 రిపీట్ అవుతుందా..?

- Advertisement -

2024 ఎన్నికల గడువు దగ్గర పడుతున్న కొద్ది ఏపీ రాజకీయాల్లో సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. నిన్నటి వరకు సైలెంట్ గా ఎవ్వరి ప్రచారం వారు చేసుకుంటున్నారు. ఇప్పడు పొత్తు రాజకీయాలు తెరపైకి వచ్చాయి. 2024 ఎన్నికల్లో టీడీపీ-జనసేన-బీజేపీ పొత్తు ఉంటుందని జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ మరోసారి క్లారిటీ ఇచ్చారు. కచ్చితంగా వైసీపీని గద్దె దింపడం ఖాయమని స్పష్టంచేశారు. అయితే ఈ పొత్తుల వలన నిన్నటి వరకు 175 సీట్లు ఖాయమంటున్న వైసీపీ ఇరకాటంలో పడిందా..? అసలు ఈ పొత్తుల ప్రభావం వైసీపీ పై ఉంటుంది..? వైసీపీ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఉందా..? ఇప్పుడు ఇదే ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్…

ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత 2014లో జరిగిన తొలి అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తులతో 175 స్థానాల్లో తెలుగు దేశం పార్టీ 102 స్థానాలను కైవశం చేసుకున్న సంగతి తెలిసిందే. వైఎస్సార్‌సీపీ 67 స్థానాల్లో గెలుపొందగా, బీజేపీ 4, ఇతరులు 2 స్థానాల్లో గెలుపొందారు. తర్వాత 2019 ఎన్నికల్లో పొత్తులు లేకుండా 175 స్థానాల్లో టీడీపీ 23 స్థానాలకు పరిమితం కాగా జనసేన ఒకే ఒక నియోజకవర్గంలో విజయం సాధించింది. వైఎస్సార్‌సీపీ 151 చోట్ల విజయం సాధించి ప్రభంజనం సృష్టించింది.

ఇదీలా ఉంటే 2024 ఎన్నికల్లో టీడీపీ-జనసేన-బీజేపీ పొత్తు పెటుకుని బరిలో దిగితే వైసీపీ పై ప్రభావం పడే అవకాశం లేకపోలేదు. కాని 2019 ఎన్నికల్లో 49.9% వైసీపీ, 39.2% టీడీపీ, 1.17% కాంగ్రెస్, 0.84% బీజేపీ, మరియు 6.78% జనసేనకి ఓట్ల శాతం వచ్చాయి. అయితే 2014లోనే ప‌వ‌న్ క‌ల్యాణ్ తెలుగుదేశానికి మ‌ద్ద‌తు ప‌లికాడు, 2019లో చంద్ర‌బాబు వ్య‌తిరేక ఓటును చీల్చేందుకు ప‌ని చేశాడు. ఇప్పుడు ప్ర‌భుత్వ వ్య‌తిరేక ఓటును చీల్చ‌నివ్వ‌ను అంటున్నాడు.

2014 లో ఉన్న పరిస్థితి ఇప్పుడు లేదు. 2014 ఎన్నికల్లో కేవలం పొత్తుల వల్ల చంద్రబాబు అధికారంలోకి రాలేదు. మరెన్నో సమీకరణాలు, కొత్త రాష్ట్రం.. అనుభవం ఉన్న నాయకుడు అవసరం… అప్పటి పరిస్థితులు కూడా కారణం. అదే ఇప్పుడు రిపీట్ కాకపోవచ్చు అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. 2019 ఎన్నికల్లో కేవలం పొత్తులు లేకపోవడం వల్ల టీడీపీ ఘోర పరాజయం అవ్వలేదు. చంద్రబాబు తీసుకునే కొన్ని నిర్ణయాల వలన పూర్తిస్థాయి వ్యతిరేకత వచ్చింది.

మరో వైపు ఇప్పుడు ప్రజా సంక్షేమ పథకాలు మునుపటి కంటే మెరుగ్గా అందుతున్నాయి. మరియు అన్ని పార్టీల వారు లబ్ధి పొందుతున్నారు. ఇక్కడ ప్ర‌భుత్వ వ్య‌తిరేక ఓటుకు చోటులేదు, ప్ర‌భుత్వ సనుకూల ఓట్లు పెరిగాయి. ప్రభుత్వ పాఠశాలు అభివృద్ధి, గ్రామ-వార్డు సచివాలయం, వాలంటీర్స్ తో ప్రజలకు మరింత చేరువగా ప్రభుత్వ సేవలు. ఇంకా ఎప్పటినుంచో కీలకంగా మారిన బీసీ ఓట్లు.. ఇప్పట్లో చంద్రబాబును బీసీలు నమ్మె పరిస్తులలో లేరు. మరోపక్క రోజుకో మాట మార్చుతు.. రోజుకో పొత్తు పెట్టుకుంటున్న పవన్ కళ్యాణ్ తో జతగట్టె పరిస్థి కూడా లేదు… ప్రస్తుతం బీసీ ఓట్లు వైఎస్ జ‌గ‌న్ వైపు మొగ్గు చూపుతున్నాయి. ఎదిఎమైనా.. ఎన్ని పొత్తు పెట్టుకున్న 2024 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వస్తుందంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

-Anjanreddy kodathala

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -