Sunday, April 28, 2024
- Advertisement -

నడుము నొప్పి బాధ తగ్గాలంటే!

- Advertisement -

దాదాపుగా 90 శాతం మందికి తమ జీవితంలో ఏదో ఒక సమయంలో వెన్నముక భాగంలో వచ్చే నడుము నొప్పితో బాధపతారని అధ్యయనంలో తెలింది. ఇలాంటి సమయంలో చాలామంది ఏదో ఒక పెయిన్ కిల్లర్ వేసుకుని ఊరుకుంటారు తప్ప దానికి సరైనా చికిత్స తీసుకోవడం లేదనే విషయం తెలుస్తుంది.

వయసుతో సంబందం లేకుండా నడుము నొప్పులు వస్తున్నాయి. చాలా మంది స్త్రీపురుషులు నముడు నొప్పితో బాధపడుతుంటారు. ఇలాంటి వారు కొన్ని జాగ్రత్తలను పాటిస్తే ఈ నొప్పిని నివారించవచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఒక కప్పు పాలలో రోజు తేనె వేసుకొని తాగడం వల్ల కూడా నడుము నొప్పి రాకుండా ఉంటుంది. చిన్న ముక్కలుగా తరిగిన అల్లాన్ని రెండు కప్పుల నీళ్ళలో వేసి అవి ఒక కప్పు అయ్యే వరకు మరిగించాలి. ఈ నీటిని వడగట్టి చల్లారిన తర్వాత దీనిలో తేనే కలుపుకొని తాగితే నడుము నొప్పి నుండి ఉపశమనం కలుగుతుందని వైద్యులు అంటున్నారు.

వంద గ్రాముల గసగసాలను పొడి చేసి పెట్టుకొని రెండు చెంచాల పొడిని గాల్లసు పాలలో కలుపుకొని రోజుకు రెండు సార్లు తాగడం వల్ల నొప్పి త్వరగా తగ్గుతుంది. నడుము నొప్పిగా ఉన్న భాగంలో ప్రతి అరగంటకోసారి ఐస్‌తో కాపడం పెట్టుకోవడం ద్వారా నొప్పి తగ్గుతుందట.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -