Monday, May 13, 2024
- Advertisement -

కన్నీళ్లు పెట్టిస్తున్న… తాగుబోతు రమేష్ రియల్ లైఫ్ స్టోరీ!

- Advertisement -
tagubotu ramesh rela life story will makes you cry

తాగుబోతు రమేష్.. వచ్చిన అతి తక్కువ టైంలోనే మంచి కమెడియన్ గా పేరు తెచ్చుకున్నాడు. అయితే తనదైన తాగుబోతు నటనతో అందరిని ఆకటుకున్నాడు. తాగుబోతు రమేష్ జీవితమే కష్టాల కడలి. కరీంనగర్ జిల్లా గోదావరి ఖని 25 నవంబర్ 1980 న రమేష్ జన్మించాడు. రమేష్ తండ్రి సింగరేణి గనుల్లో ఉద్యోగి, అతని తల్లి గృహిణి. రమేష్ చిన్నతనంలో అతని తండ్రి మందు తాగి వాళ్ళ అమ్మను కొట్టడం చేసేవాడు. రమేష్ తన తల్లిని నవ్వించడానికి తన తండ్రిలా తాగినట్లు నటించేవాడు.

ఇక ఆ తర్వాత రమేష్ మిమిక్రీ నేర్చుకొని ప్రదర్శనలు నిర్వహించేవాడు. అతనికి తాగుబోతు పాత్రలు చేసి ప్రసిద్ది చెందిన బెంగాలీ హాస్య నటుడు జోరూ ముఖర్జీ స్ఫూర్తి అని రమేష్ చెబుతుంటాడు. సినీ రంగంలోకి రాకముందు ఒక భవనంలో సూపర్ వైజర్ గా పనిచేశాడట రమేష్. తన తల్లిదండ్రుల మరణం, తన సోదరి వివాహం తరువాత తను నటనా జీవితం ఎంచుకున్నాడు. 2005 లో అక్కినేని ఫిలిం ఇనిస్టిట్యూట్ లో చేరి నటనపై శిక్షణ తీసుకున్నాడు. శిక్షణ టైంలో డైరెక్టర్ సుకుమార్ రమేష్ కు చిన్న రోల్ ఇచ్చాడు. ఇది రమేష్ కి తొలి సినిమా. జగడం తర్వాత రమేష్ కి పెద్దగా అవకాశాలు రాలేదు. ఆ టైంలో రమేష్ కు ప్రముఖ నటుడు ఉత్తేజ్ తో పరిచయం ఏర్పడింది. ఉత్తేజ్ రమేష్ కు తెలుగు సినిమా అగ్ర దర్శకుడు కృష్ణ వంశీని పరిచయం చేసాడు. వంశీ తన మహాత్మా సినిమాలో ఒక తాగుబోతు పాత్రను ఇచ్చారు. ఈ సినిమా తన కెరీర్ లో ఒక ప్రధాన మలుపుగా మారింది.

మహాత్మా సినిమాలో రమేష్ నటన చూసిన తర్వాత నందిని రెడ్డి తన మొదటి సినిమా అలా మొదలైంది చిత్రంలో తాగుబోతు పాత్ర కోసం రమేష్ ను తీసుకుంది. ఈ సినిమా తర్వాత రమేష్  టాప్ కమెడియన్ గా పేరు తెచ్చుకున్నాడు. ఆ సినిమా తరువాత తాగుబోతు రమేష్ పేరు సార్దాకమయింది. రమేష్ చేస్తున్న సినిమాలో ఎక్కువ గా తాగుబోతు పాత్రలే వస్తున్నాయి. తన నటన చూస్తే నిజంగా మందు తాగి ఇలా చేస్తున్నాడా అనేలా ఉంటుంది. కానీ రమేష్ కు అసలు మందు అలవాటు  లేదట. రమేష్ కు 25 మే 2015 న స్వాతి తో పెళ్లి జరిగింది. ప్రస్తుతం సినిమాలతో నిమిషం కూడా తీరిక లేకుండా చాలా బిజీగా ఉన్నాడు తాగుబోతు రమేష్.

Related

  1. మీ ఫేవరెట్ హీరోలు వాడే లగ్జరీ కార్ల గురించి తెలుసా..?
  2. ఎన్టీఆర్ ఆస్తి ఎంతో తెలుస్తే షాక్ కావాల్సిందే!
  3. బిత్తిరి సత్తి రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?
  4. యాంకర్ రవి రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -