Monday, May 20, 2024
- Advertisement -

ఫ్రీ కదా అని వాడేశారా… అయితే బిల్లు క‌ట్టాల్సిందే

- Advertisement -
free jio net rs 27 thousand bill

టెలికం రంగంలో ఉన్న అన్ని కంపినీలకు దడ పుట్టించింది జియో. వచ్చి అతి తక్కువ కాలంలోనే ఎక్కువ మంది యూజర్లను సంపాధించింది. అన్ని ఫ్రీగా ఇస్తుండటంతో జియో వాడటానికి యూజర్లను ఆసక్తి చూపించారు. ముఖేష్ అంబానీ నేతృత్వంలోని జియో ప్ర‌క‌టించిన ఆఫ‌ర్ ఎన్నో సంచ‌ల‌నాల‌కు కేంద్ర బిందువు అయ్యింది. జియో నెట్ – కాల్స్ వెల్ కం ఆఫ‌ర్‌లో ఆల్ ఫ్రీ అవ‌డంతో దేశ‌వ్యాప్తంగా జియో సిమ్‌ల కోసం జ‌నాలు ఎగ‌బ‌డ్డారు. జియో సిమ్ దొరికితే చాలు అన్నంతగా సంతోషపడ్డారు.

అయితే జియో సిమ్‌తో నెట్, అప‌ర‌మిత కాల్స్ ఎంజాయ్ చేస్తోన్న రిలయన్స్ జియో వినియోగదారులు సోషల్ మీడియాలో కనిపించిన ఓ పోస్ట్ చూసి షాకయ్యారు. వెల్‌కమ్ ఆఫర్‌లో భాగంగా నిర్దిష్ట కాలపరిమితి వరకూ డేటా సర్వీసులు ఫ్రీ అని జియో ప్రకటించిన సంగతి తెలిసిందే.

అయితే ఫేస్‌బుక్, వాట్సాప్‌లో హల్‌చల్ చేస్తున్న ఓ పోస్ట్ వినియోగదారులను డైలమాలో పడేసింది. గందరగోళంలోకి నెట్టేసింది. రిల‌య‌న్స్ జియో వాడుతున్న ఓ వినియోగ‌దారుడికి రూ. 27 వేల బిల్లు కంపెనీ నుంచి వ‌చ్చిన‌ట్టు ఆ బిల్లులో ఉంది. కలకత్తాలో ఉంటున్న అయునుద్దిన్ మొండల్‌‌కు జియో నుంచి వ‌చ్చిన బిల్లులో 550 జీబీ వాడుకున్నందుకు గానూ 27వేలకు పైగా వసూలు చేస్తున్నట్లు ఆ బిల్లులో ఉంది. అయితే ఈ బిల్లు ప్రస్తుతం దేశ‌వ్యాప్తంగా సోష‌ల్ మీడియాలో జోరుగా వైరెల్ ట్రెండ్ అవుతోంది. మరి జియో ప్ర‌తినిధులు ఎలా స్పందిస్తారో చూడాలి.

Related

  1. జియోకు దిమ్మతిరిగే ఆఫర్ ఇచ్చిన ఆర్‌కామ్‌
  2. రిలయన్స్ జియో మరో అదిరిపోయే ఆఫర్
  3. మరో అదిరిపోయే ఆఫర్ ఇచ్చిన జియో
  4. అబ్బో జియో దెబ్బ!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -