Saturday, April 27, 2024
- Advertisement -

బిత్తిరి సత్తి రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?

- Advertisement -
teenmar news bittir satti shocking remuneration

చాలా మంది పెద్ద సెలబ్రెటీ అయిపోదామని, స్టార్ జీవితాన్ని ఎంజాయ్ చేద్దామని అనుకుంటారు. అయితే కొందరు వెండితెరలో, మరి కొందరు బుల్లితెర పైనా రారాజుగా ఎదుగుతారు. అయితే అలా చాలా మంది పనిని బట్టి రాష్ట్రాల్లోనే కాకుండా దేశంలో కూడా చాలా పాపులార్ అవుతాడు.

అయితే అలాంటి కోవకి చెందినవాడే బిత్తిరి సత్తి. తెలుగు రాష్ట్రాల్లో ఎంతో మంది అభిమానులని సంపాదించుకున్న బిత్తిరి సత్తి, v6 ఛానెల్లో వచ్చే తీన్మార్ వార్తల్లో యాంకర్ సావిత్రితో కలిసి పనిచేస్తూ బాగా పాపులర్ అయ్యాడు. అయితే దేశ రాజకీయాలతో పాటు రాష్ట్ర రాజకీయాల్లో కూడా అన్ని వార్తలను తీసుకొని వాటిని ప్రజలకి కొత్త రకంగా చూపించడం ఈ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం. అయితే ఒక విధంగా చెప్పాలంటే బిత్తిరి సత్తి వల్లనే v6 చానెల్ TRP రేటింగ్ అమాంతం పెరిగి పోయిందంట.

అయితే బిత్తిరి సత్తి వ్యక్తిగత జీవితానికొస్తే అతని అసలు పేరు చేవెళ్ల రవి. రంగారెడ్డి జిల్లాలోని పమేనా గ్రామానికి చెందిన రవి చిన్నప్పటి నుండి ఎన్నో ఒడుదుడుకులు ఎదుర్కొన్న రవి, భిన్నమైన ప్రజలని చూసి అందరిని ఇమిటేట్ చేయటం బాగా నేర్చుకున్నాను. అయితే స్నేహితుల సలహా మేరకు హైద్రాబాదులో ఉద్యోగం కోసం వచ్చాడు. అతనికి ఉద్యోగం కూడా అంత త్వరగా రాలేదు. ఎన్నో కష్టాలు పడ్డాక మొదట జీ తెలుగులో కామెడీ క్లబ్ షో అనే కార్యక్రమంలో మొదటిసారిగా అవకాశం వచ్చింది. అయితే ఆ షో సక్సెస్ అవ్వడంతో రవికి కాస్త ఊరట తెచ్చిపెట్టింది. ఆ తరువాత v6 ఛానెళ్లలో తీన్మార్ వార్తలు చదవటానికి అవకాశం రావటంతో ఇందులో వచ్చి చేరాడు బిత్తిరి సత్తి అలియాస్ రవి.

అయితే తీన్మార్ వార్తలు చదవటానికి ముందు అతడికి జీతం కూడా ఏమి ఇవ్వలేదంట. అతని పనికి తగ్గ జీతం ఇస్తామని, అది కూడా వారు సూచించిన దానినే తీసుకోవాలని కండిషన్ పెట్టారంట. రవి కష్టానికి తగిన ఫలితం దక్కడంతో తన తొలి నెలలో ఉచితంగా పని చేసినా, రెండో నెలలో 30వేలు తన తొలి సంపాదనగా తీసుకున్నాడు. ఆ తరువాత ఆ షో బాగా పాపులర్ అవ్వడంతో రవికి కూడా మంచి పేరు, ఛానల్ కి కూడా దేశంలో పెద్ద గుర్తింపు తెచ్చిపెట్టింది. అంతే కాకుండా రవికి కూడా ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెట్టిందంట. ప్రస్తుతం రవి తన జీతాన్ని నెలకి లక్ష 30వేలు తీసుకుంటున్నాడంట. అంతే కదా.. ఎంతైనా కష్టానికి తగిన ఫలితమే దక్కింది మన బిత్తిరి సత్తికి.

Related

  1. చిరు ఎంట్రీ ఇస్తుంటే .. పవన్ ఎగ్జిట్ కానున్నాడా..?
  2. శ్రీముఖి.. యాంకర్ ఎందుకు అయ్యిందంటే?
  3. పవన్‌ జీవన విధానం చూస్తే షాక్‌ కావాల్సిందే!
  4. ఫ్రీగా ఫేస్‌బుక్‌ను వాడలంటే ఇలా చేయండి!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -