Saturday, April 27, 2024
- Advertisement -

జెన్యూన్ గెలుపు జగన్‌దే… బాబు గెలుపు వెనకాల కుట్రను బయటపెట్టిన టిడిపి ఎంపి

- Advertisement -

2014లో ఎపి ఎన్నికల్లో చంద్రబాబు గెలుపు వెనకాల కుట్రకోణం ఉందా? ఉంది అనే అంటున్నారు బాబుకు అత్యంత సన్నిహితుడైన టిడిపి ఎంపి. ఇప్పుడు ఈ ఎంపి వ్యాఖ్యలే సంచలనం సృష్టిస్తున్నాయి. 2014 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ నాట కురుక్షేత్ర యుద్ధమే జరిగింది. ఒంటరిగా ఫైట్ చేసినప్పటికీ ప్రజాభిమానం విషయంలో మాత్రం అంతిమ విజేతగా జగనే నిలిచాడన్న వ్యాఖ్యలు అప్పట్లోనే వినిపించాయి. అయితే మోడీ, పవన్‌లతో కలిసి పొలిటికల్ మేనేజ్మెంట్‌తో పాటు 600అబద్ధపు హామీలతో ఓట్లు కొల్లగొట్టి గెలిచాననిపించుకున్నాడు చంద్రబాబు.

అయితే ఇప్పుడు ఆ గెలుపు కూడా గెలుపే కాదని, ప్రజల ఓట్లతో వచ్చిన గెలుపు అసలే కాదని స్వయంగా టిడిపి ఎంపి కేశినేని నాని చెప్పుకొస్తున్నాడు. చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు అయిన ఈ బిజినెస్ మేన్ కం ఎంపి టిడిపికి ఉన్న ఆర్థిక మద్ధతుదారుల్లో ఒకరు. అలాంటి ఎంపినే ఈవీఎంల మేనేజ్‌మెంట్‌తో వచ్చిన గెలుపని చెప్పేస్తున్నాడు. అఫ్కోర్స్ చంద్రబాబు కూడా అదే పాట పాడుతున్నాడు. తెలంగాణాలో జరిగిన ఎన్నికల్లో తెలంగాణా ఓటర్లతో పాటు సీమాంధ్ర ఓటర్లు కూడా చంద్రబాబు పార్టీని పూర్తిగా ఛీ కొట్టిన విషయం తెలిసిందే. అందుకే ఆ ఘోర ఓటమికి కారణాలు అంటూ ఈవీఎంల కుట్ర అన్న అర్థం వచ్చేలా మాట్లాడుతున్నారు. అయితే ప్రజలు మాత్రం వైఎస్ రాజశేఖరరెడ్డి మరణానికి కొన్ని నెలల ముందు నుంచీ సోనియాతో చీకటి పొత్తు నడిపిన చంద్రబాబు, 2014 ఎన్నికల్లో మోడీతో పొత్తు పెట్టుకున్న చంద్రబాబు……2014 ఎన్నికల్లో ఈవీఎంల కుట్రకు పాల్పడ్డాడని ఎందుకు అనుకోకూడదని ప్రశ్నిస్తున్నారు.

నిజానికి 2014 ఎన్నికల సమయంలో సీమాంధ్రలో జగన్‌కే అత్యంత ఎక్కువ ప్రజాదరణ ఉన్నది అన్న మాటను టిడిపి నాయకులు కూడా ఒప్పుకుంటారు. చంద్రబాబుతో పోల్చితే జగన్‌కే ప్రజాదరణ ఎక్కువ ఉన్నది అన్న మాట వాస్తవం. అందుకే జాతీయ సర్వేలన్నీ కూడా అదే విషయం చెప్పి సీట్లు కూడా జగన్‌కే ఎక్కువ వస్తాయని చెప్పాయి. అయితే ఎన్నికల ఫలితాల్లో మాత్రం చాలా తక్కువ మార్జిన్‌తో చంద్రబాబు పార్టీ గెలిచింది. ఈ నేపథ్యంలో చంద్రబాబు గెలుపు వెనకాల కూడా ఈవీఎంల కుట్ర ఉండొచ్చు అన్న విశ్లేషకుల మాటలను పూర్తిగా కాదనగలమంటారా? చీకట్లో చిదంబరం కాళ్ళు పట్టుకుని నడిపించిన పొత్తు, మరోవైపు మోడీతో బహిరంగంగా పొత్తులాంటి వ్యవహారాలు నడిపిన వాళ్ళు ఇలాంటి కుట్రలకు పాల్పడి ఉండరు అంటే నమ్మడం సాధ్యమేనా?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -