Sunday, May 19, 2024
- Advertisement -

Adya Special: సిస్టర్ సెంటిమెంట్ ఎవరికి కలిసొచ్చింది

- Advertisement -

టాలీవుడ్లో వన్స్ అపాన్ ఎ టైమ్ సిస్టర్ సెంటిమెంట్ భలే నడిచింది.కాని నేటి రోజుల్లో ఆ సెంటిమెంట్ ఏ మాత్రం వర్కవుట్ కావడం లేదు. అయినప్పటికీ అప్పుడపుడు కొందరు సిస్టర్ సెంటిమెంట్ తో సినిమాలు చేస్తూనే ఉన్నారు.

ఒక రకంగా చెప్పాలంటే….టాలీవుడ్ హీరోలందరికీ సిస్టర్ సెంటిమెంట్ అంటూ ఒకటుంది.అయితే ఈ సెంటిమెంట్ ఒకప్పటి రోజుల్లో భలే వర్కవుట్ అయింది. సీనియర్ ఎన్టీఆర్ , ఏ.ఎన్.ఆర్, శోభన్ బాబు వరకూ  అంతా ఈ సిస్టర్ సెంటిమెంట్ తో సక్సెస్ లు అందిపుచ్చుకున్నవారే. అయితే ఆతరువాత ఆ ఫార్మాట్ ను నెక్స్ట్  జనరేషన్ హీరోలైన బాలయ్య, చిరంజీవి, నాగార్జునలు కూడా అందిపుచ్చుకున్నారు. వారు కూడా ఎంతో కొంత సిస్టర్ సెంటిమెంట్ తో వండర్స్ క్రియేట్ చేశారు. అదే ఫార్మాట్ ను వారు మొన్నటి వరకు కొనసాగించారు.

నేటి జనరేషన్ హీరోలైన వారికి ఈ సిస్టర్ సెంటిమెంట్ పెద్దగా వర్కవుట్ అయిన దాఖాలాలు లేవు. పవన్ ,మహేష్ ,తారక్, చెర్రీలు సైతం సిస్టర్ సెంటిమెంట్ ను పండించే ప్రయత్నం చేశారు. కాని ఎవ్వరికీ అది వర్కవుట్ కాలేదు.పవన్ అన్నవరంతోటి, మహేష్ అర్జున్ చిత్రంతోను సిస్టర్ పేరు చెప్పి…డిజప్పాయింట్ అయ్యారు. ఒక్క యంగ్ టైగర్ కు మాత్రమే రాఖితో అది కలిసొచ్చింది. అందుకే కాబోలు తనకు అచ్చొచ్చిన సెంటిమెంట్ ను మళ్లీ వేదలమ్ రీమేక్ రైట్స్ తీసుకుని రిపీట్ చేసే ఆలోచనలో ఉన్నాడు. 

 సిస్టర్ సెంటిమెంట్ విషయంలో చెర్రీ కూడా బ్రూస్లీ తో కుదేలైపోయాడు. ఏదో చేద్దామనుకుంటే ఏదో అయింది.అయితే ఇక్కడ మనకు నాన్ స్టార్ హీరోలుగా ఉన్న కొందరు సిస్టర్ సెంటిమెంట్ ను బాగానే పండించారు.

రాజశేఖర్ ,రాజేంద్ర ప్రసాద్ తో పాటు కొందరు స్టార్లుగా ఎదగలేని హీరోలు ఈ ప్రయత్నంలో కొంత వరకు సక్సెస్ అయ్యారు. కాని వారు స్టార్ హీరోలు కాకపోవడంతో పైకి ఎదగలేకపోయారు. అయితే మన తారకుడు ఈవిషయంలో 

కాస్త ముందంజలోనే ఉన్నాడు. వేదలమ్ సిస్టర్ సెంటిమెంట్ ను ఇక్కడ కూడా అదే డైరెక్టర్ శివతో వర్క్ చేసి మరో సారి సిస్టర్ సెంటిమెంట్ ను చూపించి సక్సెస్ కొడదామని చూస్తున్నాడు.

సో నందమూరి హీరోలైన ఎన్టీఆర్ ,బాలయ్య ,తారక్ లకు సిస్టర్ సెంటిమెంట్ సూపర్బ్ గా వర్కవుట్ అయిందన్నమాట.

 

Exclusive: మెగా హీరోలపై  సోషల్ మీడియాలో భారీ చర్చ

ఆధ్యా న్యూస్ ఈవిషయంలో కొందరు మెగా అభిమానుల వైఖరిని, అలాగే మిగతా హీరోల అభిమానుల నుంచి కూడా ఎందుకు మెగా హీరోల విషయంలో ఇంతటి చిరాకును వ్యక్త పరుస్తుంది తెలుసుకునే ప్రయత్నం చేసింది. ఆ ప్రయత్నంలో తెలంగాణ ,రాయలసీమ  సినీ ప్రియులనుంచి కరెక్ట్ విషయాలు మాకు వచ్చాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -