- Advertisement -

వామ్మో.. సబ్బు!!!

- Advertisement -
Things We Learn From toilet soaps ads

మార్కెట్లో రకరకాల సబ్బులు దొరుకుతుంటాయి. తమ కంపెనీ సబ్బులు వాడితే  మంచి రంగు వస్తారని, శరీరం నుండి మంచి సువాసన వస్తుందని ఆయా సబ్బుల కంపెనీ వారు టీవీల్లో యాడ్స్ ఇస్తుంటారు. ఇంకేముంది అందరూ ఆ యాడ్స్ చూసి సబ్బులను కొని వాడేస్తుంటారు. అయితే సబ్బుల నుండి ఎక్కువగా నురగ వస్తుంటే మాత్రం డేంజరేనని స్కిన్ ఎక్స్ పర్ట్స్ చెబుతున్నారు. మార్కెట్ లో లభించే సబ్బులలో  దాదాపు 70% సబ్బులు మన శరీరానికి హాని చేసేవేనని అంటున్నారు.

మరి మనం వాడే సబ్బులు క్వాలిటీవో  కాదో  టాప్ తెలుగు మీడియా ద్వారా తెలుసుకుందాం. టీఎఫ్ఎం(TFM)  ద్వారా సబ్బులు క్వాలిటీవా కాదా తెలుసుకోవచ్చు. టీఎఫ్ఎం అంటే టోటల్ ఫ్యాటీ మ్యాటర్. ఈ టీఎఫ్ఎం శాతం ఎంత ఎక్కువగా ఉంటే ఆ సబ్బు అంతటి నాణ్యమైన గుణాలను కలిగి ఉంటుంది. 76% కంటే ఎక్కువ టిఎఫ్ఎం ఉన్నవి గ్రేడ్ 1 సబ్బులని,  70- 75% వరకు టీఎఫ్ఎం ఉంటే అవి గ్రేడ్ 2 సబ్బులని, 60 నుంచి 70 % మధ్యలో టీఎఫ్ఎం ఉన్నవి గ్రేడ్ 3 సబ్బులని  Bureau of Indian Standards  చెబుతోంది. గ్రేడ్ 2,3 సబ్బుల్లో ఫిల్లర్లు అధికంగా ఉంటాయి.

వీటిలో శరీరానికి హాని కలిగించే పదార్థాలు ఎక్కువగా ఉంటాయని,  వీటిని వాడితే చర్మానికి హాని కలుగుతుంది. ఈ సబ్బులు నీటిలో కలిసిప్పుడు మెత్తగా అయిపోయి చాలా త్వరగా అరిగిపోతాయి.  అలాగే నురగ ఎక్కువ వచ్చినా వాటిని నాసిరకం సబ్బులుగానే పరిగణించాలి. ఎలాంటి చర్మం ఉన్నవారికైనా గ్రేడ్ 1 సబ్బే మంచిదని, ఈ సబ్బులు చర్మానికి మృదుత్వాన్ని ఇస్తాయని చర్మనిపుణులు చెబుతున్నారు.  

సో… సబ్బులు కొనే ముందు TFM శాతాన్ని చూసి కొనడం మర్చిపోకండి.

Related

  1. ఫ్రీగా ఫేస్‌బుక్‌ను వాడలంటే ఇలా చేయండి!
  2. అలాంటి షకీలా.. ఇలా అయ్యిందేంటి?
  3. బ్రహ్మాజీకి ఏమైంది.. ఏంటి ఆ గాయాలు?
  4. సమంత ఫ్యాన్స్ కు మహేష్ కుమార్తె సర్ ప్రైజ్!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -