Tuesday, May 7, 2024
- Advertisement -

సమంత ఫ్యాన్స్ కు మహేష్ కుమార్తె సర్ ప్రైజ్!

- Advertisement -
Mahesh Babu Daughter Sitara Cute Dubsmash Samantha Dialogue From Brahmotsavam

పిల్లలు చిన్ని చిన్ని మాటలతో మాట్లాడితే ఎంత బాగుంటదో కదా… పదాలు పట్టిపట్టి పలుకుతూ ఉంటే వినడానికి చాలా బాగుంటుంది. సూపర్ స్టార్ మహేష్ బాబు కుమార్తె సితార కూడా ఇలానే ముద్దుగా మాట్లాడుతోంది. సింగిల్ టేక్ లో మహేష్ సినిమా డైలాగుల్ని చేప్పేస్తోంది. మహేష్ బాబు, సమంత కలిసి నటించిన సినిమా ‘బ్రహ్మోత్సవం’. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు.

అయితే ఈ చిత్రంలో సమంత చెప్పిన ఓ డైలాగును తన ముద్దుముద్దు మాటలతో – క్యూట్ క్యూట్ ఎక్స్  ప్రెషన్స్ తో ఎంతో చక్కగా చెప్పింది మహేష్ బాబు కుమార్తె సితార. ఆమె అలా చెబుతూ ఉంటే అమ్మ నమ్రత ఎంతో సంతోషపడుతోంది. ఆ విషయాన్ని నలుగురితో పంచుకోకుండా ఎలా ఆగగలదు! అదే పని చేసింది నమ్రత. ‘ఏడు తరాలా..?  వెతికితే దొరకనంతమందా..? కలిస్తే వదులుకోలేనంతమందా..?’… ఆ సినిమాలో సమంత చెప్పిన ఈ డైలాగులును సితార చెబుతూ ఉంటే – అమ్మ నమ్రత వీడియో తీసింది. దాన్ని ట్విట్టర్ ద్వారా సమంతకు షేర్ చేసింది.

ఈ వీడియో చూసిన మహేష్ అభిమానులు కూడా లైకులు కొట్టకుండా ఎలా ఉంటారు చెప్పండీ! ఇక కామెంట్లూ షేర్లు… చెప్పాల్సిన పనే లేదు. సితార చెప్పిన డైలాగులతోపాటు…  ఆ డైలాగులు చెబుతున్నప్పుడు పెడుతున్న ఫేస్ ఫీలింగ్స్ మరీ ముద్దొచ్చేలా ఉన్నాయి. మహేష్ అభిమానులతో సమంత ఫ్యాన్స్ కూడా ఇదో సర్ ప్రైజ్ బహుమానమే అని చెప్పాలి. సితార చెప్పిన డైలాగుల వీడియోని ట్విట్టర్ లో పోస్ట్ చేసింది నమ్రత. ఇప్పుడా వీడియో వైరల్ అవుతోంది. ఆ క్యూట్ క్యూట్ డైలాగుల్ని మీరు కూడా చూసెయ్యండి మరి!

{youtube}jry1dIC6zlQ{/youtube}

Related

  1. సమంత, సిద్దార్ధ బ్రేకప్ కథ!
  2. సమంత ప్రేమమ్ లో ఎందుకు నటించలేదంటే?
  3. చైతూ ని చీట్ చేసిన సమంత!
  4. సిద్ధార్థ్ వ్యవహారం గురించి నిజాలు చెప్పిన సమంత!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -