Friday, April 19, 2024
- Advertisement -

షియాజీ షిండే సినిమాల్లోకి రాకముందు ఏం పని చేశేవారో తెలుసా ?

- Advertisement -

దర్శకుడు వివి వినాయక్ దర్శకత్వం వహించినటు వంటి ఠాగూర్ చిత్రం తెలుగు సినీ ప్రేక్షకులకు ఇప్పటికీ బాగానే గుర్తుంటుంది. ఈ సినిమాలో విలన్ గా షియాజీ షిండే నటించాడు. ఈ సినిమాతో అతనికి మంచి క్రేజ్ వచ్చింది. అయితే ఒకప్పుడు తన విలనిజంతో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న షిండేకి ప్రస్తుతం సినిమా అవకాశాలు ఎక్కువగా రావడం లేదు. అయితే తాజాగా ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు చెప్పాడు.

తాము ఆరుగురు సంతానమని.. తమ తల్లిదండ్రులు వ్యవసాయం చేసేవారని చెప్పాడు. తమ ఊర్లో ఏడవ తరగతి వరకే స్కూల్ ఉంటుందని.. ఆ తర్వాత చదువులకై తన సోదరి ఇంటికి వెళ్లి చదువుకున్నట్లు ఆయన చెప్పారు. అలాగే తాను ఇంటర్మీడియట్ చదివే రోజులలో కాలేజీలోనే నైట్ వాచ్ మెన్ గా కూడా పని చేశానని ఆ తర్వాత చదువు పూర్తయిన తర్వాత సినిమాలకు దృష్టి మల్లడంతో బొంబాయి వెళ్ళి సినిమాలలో ప్రయత్నించానని చెప్పుకొచ్చాడు.

కానీ మళ్లీ ఆర్ధిక సమస్యలు రావడంతో బ్యాంకులో క్లర్క్ కూడా పని చేశాడని తెలిపాడు. ఆ తర్వాత పలు ఉద్యోగాలను వదిలేసుకున్నట్లు చెప్పాడు. ఠాగూర్ చిత్రంలో నటించే అవకాశం వచ్చిందని ఆ తర్వాత మళ్ళీ వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదని తెలిపాడు. అంతేగాక తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ, తదితర భాషల్లో నటిస్తున్నానని.. అయితే తెలుగులోనే ఎక్కువ పేరు వచ్చిందని.. తెలుగు ప్రేక్షకులకి ఎప్పటికి రుణ పడి ఉంటానని చెప్పాడు.

పవన్ కళ్యాణ్ కెరీర్‌లో అట్టర్ ఫ్లాప్ అయిన సినిమాలు..!

సౌందర్య వందల కోట్ల ఆస్తులు ఎవరి దగ్గర ఉన్నాయో తెలుసా ?

మన దర్శకుల రెమ్యునరేషన్ ఎంతో తెలుసా ?

ఇంత మంది హీరోల్లో చరణ్ కు ఇష్టమైన హీరో ఎవరో తెలుసా ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -