Thursday, May 16, 2024
- Advertisement -

యువ‌తితో భ‌ర్త‌ను అడ్డంగా పట్టుకున్న భార్య‌!

- Advertisement -
wife thrashes husband for molesting women

సినిమాలో నటించాలి అని చాలా మంది సినిమా ఫీల్డ్ లోకి అడుగుపెడుతుంటారు. వెండితెర మీద త‌మ‌ను తాము చూసుకోవాలని ఆశపడుతారు. అయితే ఇక్క‌డ‌కు వ‌చ్చాక కానీ అసలు విష‌యం తెలియ‌దు. సినిమాలో చాన్స్‌లు రావాలంటే ఎంత కష్టమో. ఈ క్ర‌మంలోనే బెంగ‌ళూరులో ఓ వ్య‌క్తి సినిమాల్లో ఛాన్సులు ఇప్పిస్తాన‌ని చెప్పి అమ్మాయిల‌తో త‌న కోర్కెలు తీర్చుకుంటున్నాడు. ఈ విష‌యం భార్య‌కు తెలియ‌డంతో ఆమె అత‌డిని ఓ రేంజ్‌లో ఆడుకుంది.

బెంగ‌ళూరుకు చెందిన మంజునాథ్ అనే వ్య‌క్తి క‌న్న‌డ సినిమా ప‌రిశ్ర‌మ‌లో హీరోయిన్ ఛాన్సులు ఇప్పిస్తాన‌ని చెపుతూ ప‌లువురు అమ్మాయిల‌ను సెక్స్ ముగ్గులోకి దింపి త‌న కోరిక‌లు తీర్చుకుంటున్నాడు. ఈ నేప‌థ్యంలోనే ప‌ద్మ అనే మ‌హిళ‌ను అత‌డు నెల రోజుల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. నెల రోజుల కాపురం త‌ర్వాత అత‌డి వేధింపులు ఎక్కువ‌య్యాయి.

అయినా ఆమె మాత్రం మౌనంగానే వాటిని భ‌రించింది. తాజాగా మంజునాథ్ ఓ లాడ్జిలో ఓ యువ‌తితో సెక్స్ కార్య‌క‌లాపాలు కొన‌సాగిస్తున్నాడ‌ని స‌మాచారం అందుకున్న భార్య అక్క‌డ‌కు చేరుకుని త‌న భ‌ర్త‌ను రెడ్ హ్యాండెడ్‌గా ప‌ట్టుకుంది. అత‌డిని చెప్పుతో ఘోరంగా కొట్టింది. ఉన్న యువ‌తి కూడా అత‌డిని చెప్పుతో చెంప‌లు వాయించేసింది. ప‌క్క‌నే ఉన్న వారు కూడా అత‌డిని ఇష్ట‌మొచ్చిన‌ట్టు కొట్ట‌డంతో పాటు గుండుగీయించి బొట్లు పెట్టారు. మ‌రోసారి అత‌డు ఇలా చేయ‌న‌ని వేడుకోవ‌డంతో అత‌డిని వ‌దిలేశారు. ప్రస్తుతం ఈ వీడియో జోరుగా హల్ చల్ చేస్తోంది. మ‌రి మంజునాథ్‌ను ఎలా వాయించారో ఆ వీడియోపై మీరు కూడా ఓ లుక్కేయండి.

{youtube}iab-Ra17v2U{/youtube}

Related

  1. ప్రభాస్ ఇంటి గురించి వివరాలు!
  2. టాప్ హీరోయిన్స్ కి బూతు వీడియోస్ పంపి అడ్డంగా దొరికిన టాప్ హీరో
  3. నైట్ ఆ హీరోయిన్‌తో అడ్డంగా దొరికిపోయిన సాయిధ‌ర‌మ్‌
  4. హీరోయిన్ శృతీహాస‌న్ అడ్డంగా బుక్కైంది

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -