మాములుగా తమ భర్తలు వేరే మహిళవైపు చూస్తే అసలు సహించరు భార్యలు. ఇక అక్రమ సంబంధం పెట్టుకుంటే ఊరికే ఉంటారా? తాట తీస్తారు. ఈ విషయంలో తన భర్తలనే కాదు.. అక్రమ సంబంధం పెట్టుకున్న సదరు మహిళకు నరకం అంటే ఏంటో చూపించి దుమ్ముదులిపేస్తారు. తాజాగా ఇలాంటి ఓ ఘటనే మాస్కోలో చోటు చేసుకుంది.
తమ భర్తలతో ఎఫైర్ పెట్టుకున్న ఓ మహిళపై ఇద్దరు భార్యలు చాలా తీవ్రంగా దాడి చేయడమే కాకుండా.. నగ్నంగా ఊరేగించారు. ఇప్పుడీ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. క్రిమియాలోని ఓ గ్రామంలో నివాసముండే ఇద్దరు మహిళలు తమ భర్తలతో సాఫీగా జీవితం సాగిస్తున్నారు. మంచి ఫ్రెండ్స్ అయిన ఆ భార్యలకు తమ భర్తలపై అనుమానం వచ్చింది.
దీంతో ఆ ఇద్దరూ వారిపై కన్నేశారు. ఫైనల్ గా తమ భర్తలు ఓ మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నట్లు తెలుసుకున్నారు. టైం కోసం వేచి చూసిన ఆ ఇద్దరు రష్యన్ మహిళలు..ఓ రోజు తమ భర్తలతో అక్రమ సంబంధం కొనసాగిస్తున్న మహిళను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అంతే.. ఆమెను వీర కొట్టుడు కొట్టారు. బికినీలో ఉన్న ఆ మహిళ ముఖంపై.. ఇతర శరీర భాగాలపై దాడిచేస్తూ తీవ్రంగా కొట్టారు. అంతే కాకుండా కొట్టుకుంటూ వీధుల్లో తిప్పారు.
Related