ఇంగ్లాండ్ ఆటగాడు జో రూట్ అరుదైన ఫీట్ సాధించాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో ఇంగ్లండ్ తరఫున 50 సెంచరీలు చేసిన తొలి ఆటగాడిగా నిలిచాడు రూట్. శ్రీలంకతో జరిగిన రెండో టెస్ట్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లో సెంచరీలు చేశాడు రూట్. శతకాలు నమోదు చేయడం ద్వారా జో రూట్ ఈ ఫీట్ సాధించాడు. రూట్ అద్భుత ఆటతీరుతో ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ ఘన విజయాన్ని నమోదు చేసింది. దీంతో మూడు టెస్ట్‌ల సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకుంది.
ఓవరాల్‌గా అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక శతకాలు నమోదు చేసిన బ్యాటర్ల జాబితాలో 9వ స్థానంలో నిలిచాడు రూట్. ఫస్ట్ ప్లేస్‌లో భారత లెజెండ్ సచిన్ ఉన్న సంగతి తెలిసిందే. 100 సెంచరీలతో సచిన్ అగ్రస్థానంలో ఉండగా టెస్టుల్లో 51 సెంచరీలు చేశాడు సచిన్.
ఇక సచిన్ తర్వాత 80 సెంచరీలతో విరాట్ కోహ్లీ, 71 సెంచరీలతో రికీ పాంటింగ్, కుమార్ సంగక్కర(63), జాక్వెస్ కల్లీస్(62), హషీమ్ ఆమ్లా(55), మహేళ జయవర్దనే(54), బ్రియాన్ లారా(53) జోరూట్ కంటే ముందున్నారు.