Thursday, May 9, 2024
- Advertisement -

అబ్బ‌.. సూప‌ర్ క్యాచ్.. ఒంటి చేత్తో..

- Advertisement -

టీమిండియాతో చెన్నైలోని చెపాక్ వేదిక‌గా జ‌రుగుతున్న మొద‌టి టెస్టులో ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ ఇప్ప‌టికే ప‌లు రికార్డులు త‌న ఖాతాలో వేసుకున్నాడు. కెరీర్‌లో వందో టెస్టు ఆడుతున్న రూట్ ఈ మ్యాచ్‌లో డ‌బుల్ సెంచ‌రీ చేసిన సంగ‌తి తెలిసిందే. 218 ప‌రుగుల సూప‌ర్ ఇన్నింగ్్స‌తో స‌త్తా చాటాడు. అంతేగాక సిక్స‌ర్తో డ‌బుల్ సెంచ‌రీ పూర్తి చేసుకున్న తొలి ఇంగ్లండ్ ఆట‌గాడిగా చ‌రిత్ర స్రుష్టించాడు. అంతేకాదు 100 టెస్టులో 100 బాదిన 9వ బ్యాట్స్‌మన్గా నిలిచాడు. కెరీర్‌లో త‌న‌కు ఇది ఐదో ద్విశ‌త‌కం.

ఇక ఇవ‌న్నీ కాసేపు ప‌క్క‌న పెడితే… రూట్ అత్య‌ద్భుత ఇన్నింగ్్స కార‌ణంగా 578 ప‌రుగుల స్కోరుతో ప‌ర్యాట‌క జ‌ట్టు తొలి ఇన్నింగ్్స ముగించిన సంగ‌తి తెలిసిందే. దీంతో మూడో రోజు ఇండియా భారీ టార్గెట్తో మైదానంలో దిగింది. అయితే ఆరంభంలోనే ఓపెన‌ర్లు రోహిత్ శ‌ర్మ(6)‌, శుభ్‌మ‌న్ గిల్(29) నిరాశ ప‌రిచారు. జోఫ్రా ఆర్చ‌ర్ బౌలింగ్‌లో అవుట‌య్యారు.

అయితే కోహ్లి, ర‌హానే క్రీజులోకి రావ‌డంతో భార‌త అభిమానుల్లో ఆశ‌లు చిగురించాయి. కానీ డామ్ బెస్ బౌలింగ్‌లో వారిద్ద‌రు తేలిపోయారు. ముఖ్యంగా బెస్ బౌలింగ్‌లో ర‌హానే ఇచ్చిన క్యాచ్‌ను రూట్ ప‌ట్టిన తీరు హైలెట్‌గా నిలిచింది. 26వ ఓవ‌ర్‌లో ర‌హానే లెఫ్్ట క‌వ‌ర్ షాట్ ఆడాడు. దీంతో డైవ్ చేసిన రూట్ ఒంటిచేత్తో బంతిని ఒడిసిప‌ట్టి షాకిచ్చాడు. దీంతో ఒక్క ప‌రుగుకే ర‌హానే పెవిలియ‌న్ బాట ప‌ట్టాడు. ఇక రూట్ సూప‌ర్ క్యాచ్‌కు సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

ఇంగ్లండ్‌తో టెస్టు.. క‌ష్టాల్లో టీమిండియా!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -