Sunday, May 5, 2024
- Advertisement -

ఇండియాతో తొలి టెస్టు.. రూట్ సేన‌దే పైచేయి!?

- Advertisement -

భార‌త్‌తో జ‌రుగుతున్న తొలి టెస్టులో ఇంగ్లండ్ ప‌టిష్ట స్థితిలో నిలిచింది. మొద‌టి రోజు ఆట ముగిసేస‌రికి ప‌ర్యాట‌క జ‌ట్టు 3 వికెట్లు కోల్పోయి 263 ప‌రుగులు చేసింది. కాగా బోర్డ‌ర్‌- గావ‌స్క‌ర్ ట్రోఫీ విజ‌యంతో జోరు మీదున్న టీమిండియా- శ్రీలంకపై గెలుపుతో జోష్‌లో ఉన్న ఇంగ్లండ్ మ‌ధ్య శుక్ర‌వారం ఉద‌యం మొద‌టి టెస్టు ఆరంభమైన సంగ‌తి తెలిసిందే. చెన్నైలోని చెపాక్ స్టేడియంలో మ్యాచ్ జ‌రుగుతోంది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్కు ఓపెన‌ర్లు బర్న్స్‌, సిబ్లీ శుభారంభం అందించారు. 63 ప‌రుగుల‌కు ఒక్క వికెట్ కూడా ప‌డ‌కుండా ఓపెనింగ్ జోడి కుదురుగా ఆడింది.

అయితే 23వ ఓవ‌ర్‌లో బర్న్స్ అశ్విన్ బౌలింగ్‌లో అవుట్ కాగా, మ‌రో రెండు ఓవ‌ర్లు కూడా పూర్తి కాక‌ముందే లారెన్్స బుమ్రాకు వికెట్ స‌మ‌ర్పించుకున్నాడు. దీంతో లంచ్ విరామానికి ముందు భార‌త బౌల‌ర్ల‌కు రెండు వికెట్లు ల‌భించాయి. ఆ త‌ర్వాత రెండో సెష‌న్‌లో తొలుత టీమిండియా ఆధిక్యం క‌న‌బ‌రిచిన‌ట్టు అనిపించినా కెప్టెన్ జో రూట్‌, సిబ్లీ నిల‌క‌డ‌గా ఆడుతూ అర్ధ సెంచ‌రీలు పూర్తి చేసుకున్నారు. వీరిద్ద‌రు క‌లిసి 200 ప‌రుగుల పార్ట‌న‌ర్షిప్ న‌మోదు చేశారు.

అంతా స‌వ్యంగా సాగుతున్న స‌మ‌యంలో బుమ్రా మాయాజాలానికి బ‌లైన సిబ్లీ 87 ప‌రుగుల వ‌ద్ద ఔట‌య్యాడు. అయితే జో రూట్ మాత్రం దూకుడుగా ఆడుతూ సెంచ‌రీ పూర్తి చేసుకుని ఆట ముగిసే స‌మ‌యానికి 128 ప‌రుగుల‌తో అజేయంగా నిలిచాడు. ఇక ఆతిథ్య జ‌ట్టు ఆట‌గాళ్లు అశ్విన్‌కు ఒక‌టి, బుమ్రాకు రెండు వికెట్లు ద‌క్కాయి.

కాగా బుమ్రాకు స్వ‌దేశంలో ఇదే తొలి టెస్టు కావ‌డం విశేషం. ఈ మ్యాచ్‌లో మ‌రో విశేషం కూడా ఉంది. ఇంగ్లండ్ కెప్టెన్ జోరూట్ కెరీర్‌లో ఇది వందో టెస్టు. ఇక ఈ మ్యాచ్‌లో సెంచ‌రీ చేయ‌డం ద్వారా దీనిని మ‌రింత మ‌ధుర జ్ఞాప‌కంగా మ‌ల‌చుకున్నాడు ప‌ర్యాట‌క జ‌ట్టు కెప్టెన్‌.

భార‌త జ‌ట్టు: రోహిత్‌, శుభ్‌మన్‌‌, కోహ్లి(కెప్టెన్‌),రహానే, పంత్(వికెట్ కీప‌ర్‌)‌, అశ్విన్‌, ఇషాంత్‌, బుమ్రా, షాబాజ్‌ నదీం, వాషింగ్టన్‌ సుందర్

ఇంగ్లండ్‌: బర్న్స్‌, సిబ్లీ, లారెన్స్‌, జో రూట్‌(కెప్టెన్‌), ఓలి పోప్‌, బట్లర్‌, బెన్‌, స్టోక్స్‌,ఆర్చర్‌, జాక్‌లీచ్‌, అండర్సన్

గేల్ జిగేల్ కొడితే సిక్సు లేదా ఫోర్!

చంద్ర‌బాబు కుట్ర‌.. చెంప చెళ్లుమందిగా!

జనసేన అభిమానులకు చెక్‌ పెట్టిన సోము వీర్రాజు!

ఇదే పని వైసీపీ చేస్తే.. నిమ్మగడ్డ ఇంత సుతారంగా చెప్పేవారా?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -