Saturday, May 18, 2024
- Advertisement -

ప్ర‌పంచ‌క‌ప్ చివ‌రి మ్యాచ్‌లో ఆప్ఘ‌న్‌పై విండీస్ భారీ విజ‌యం….క్రికెట్‌కు గేల్ వీడ్కోలు

- Advertisement -

ఈ ప్ర‌పంచ‌క‌ప్ టూర్‌ను విండీస్ ఆప్ఘ‌న్‌పై భారీ విజ‌యంతో ముగింపు ప‌లికింది. ఆప్ఘ‌న్ మాత్రం 9 మ్యాచ్‌లు ఆడితే ఒక్క‌దాంట్లో కూడా గెలుపును న‌మోదు చేయ‌లేదు. గురువారం హెడింగ్లీ వేదికగా అఫ్గానిస్తాన్‌తో జరిగిన చివరి లీగ్‌ మ్యాచ్‌లో విండీస్‌ 23 పరుగుల తేడాతో విజయం సాధించింది. తలపడిన అన్ని మ్యాచుల్లోనూ ఆప్ఘ‌న్ ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇచ్చి అభిమానుల మనసులు దోచుకుంది.

మ్యాచ్‌లో టాస్ గెలిచిన విండీస్ కెప్టెన్ హోల్డ‌ర్ బ్యాటింగ్‌కు మొగ్గు చూపారు. గేల్ నిరాశ ప‌రిచినా యువ ఆట‌గాల్లు మాత్రం చెల‌రేగారు. కరీబియన్లు నిర్ణీత 50 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 311 పరుగులు చేశారు. క్రిస్ గేల్ మరోమారు నిరాశపరచగా ఎవిన్ లూయిస్ 58, షాయ్ హోప్ 77, షిమ్రాన్ హెట్‌మెయిర్ 39, నికోలస్ పూరన్ 58, జాసన్ హోల్డర్ 45 పరుగులు చేశారు. షాయ్ హోప్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. లీగ్ దశలో 9 మ్యాచ్‌లూ పూర్తి చేసుకున్న విండీస్‌కు ఇది రెండో విజయం మాత్రమే

కరేబియన్‌ జట్టు నిర్దేశించిన 312 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన అఫ్గాన్‌ నిర్ణీత ఓవర్లలో 288 పరుగులకు కుప్పకూలింది. అఫ్గాన్‌ ఆటగాళ్లలో ఇక్రామ్‌ అలీ(86; 93 బంతుల్లో, 8ఫోర్లు), రెహ్మత్‌ షా(62; 78 బంతుల్లో 10ఫోర్లు)అర్దసెంచరీలతో రాణించారు. అస్గర్‌ అఫ్గాన్‌(40), నజీబుల్లా(31) ఫర్వాలేదనిపించారు. విండీస్‌ బౌలర్లలో బ్రాత్‌వైట్‌ నాలుగు వికెట్లతో చెలరేగగా.. కీమర్‌ రోచ్‌ మూడు వికెట్లు పడగొట్టాడు. అఫ్గాన్‌ బౌలర్లలో దవ్లత్‌ రెండు వికెట్లు పడగొట్టగా, షిర్జాద్, నబి, రషీద్‌ ఖాన్‌ తలో వికెట్‌ దక్కించుకున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -