Friday, May 3, 2024
- Advertisement -

స్విమ్మింగ్‌పూల్‌లో భార్య,కొడుకుతో పాండ్యా హ‌ల్‌చ‌ల్‌!

- Advertisement -

టీమిండియా ఆల్‌రౌండ‌ర్ హార్దిక్ పాండ్యా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్నాడు. భార్య న‌టాషా, కుమారుడు అగ‌స్త్య‌తో క‌లిసి స్విమ్మింగ్‌పూల్‌లో జ‌ల‌కాలాడుతున్నాడు. కొడుకును ముద్దు చేస్తూ ఈత‌కొల‌నులో స‌రాదాగా గ‌డుపుతున్నారు. దీనికి సంబంధించిన ఫొటోల‌ను పాండ్యా భార్య న‌టాషా సోష‌ల్ మీడియాలో షేర్ చేసింది.

మా అబ్బాయి తొలిసారిగా స్విమ్మింగ్‌పూల్‌లో అని క్యాప్ష‌న్ జ‌త‌ప‌రిచింది. కాగా న‌టాషా- పాండ్యా జంట‌కు గ‌తేడాది మే నెల‌లో అగ‌స్త్య జ‌న్మించిన సంగ‌తి తెలిసిందే. ఎంగేజ్‌మెంట్ అనంత‌రం న‌టాషా గ‌ర్భం దాల్చ‌గా.. హ‌డావుడిగా ఈ జంట పెళ్లి చేసుకుంద‌ని వార్త‌లు వినిపించాయి.

ఇక కెరీర్‌ప‌రంగా, ఇటీవ‌ల టీమిండియా ఆస్ట్రేలియా ప‌ర్య‌ట‌న‌‌లో భాగంగా వన్డే, టీ20 సిరీస్‌లో పాండ్యా అద్బుతంగా రాణించాడు. టీ20 సిరీస్‌లో మ్యాన్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచాడు. టెస్టు సిరీస్‌లో మాత్రం అత‌డిని పక్కకు పెట్టారు. అయితే, ఫిబ్ర‌వ‌రి 5న ప్రారంభ‌మైన తొలి టెస్టులో ప్రాబబుల్ జ‌ట్టులో హార్దిక్ పేరు కూడా ఉంది. కానీ తుది జ‌ట్టులో మాత్రం చోటు ద‌క్కించుకోలేక‌పోయాడు.

Also Read

ఇంగ్లండ్ అంటే అంతే, ఎవరైనా తప్పు కోవాల్సిందే..

ఆ ఆరోపణల్లో నిజం లేదు, నమాజ్ చేస్తే ఇంత సీరియస్సా..!

ముఖానికి ఆవిరి పడుతున్నారా? ఈ విషయాలు తప్పనిసరి.. !

వామ్మో.. నెలలో ప్రదీప్ ఇన్ని లక్షలు సంపాదిస్తాడా!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -