Monday, June 17, 2024
- Advertisement -

భార‌త్ – ఆస్ట్రేలియా మొద‌టి టి-20 నేడే

- Advertisement -

ఆస్ట్రేలియాలో భార‌త్ జ‌ట్టు త‌న పర్యాట‌న‌ను ఈ రోజుతో మొద‌లుపెట్ట‌నుంది.మూడు మ్యాచ్‌ల టి20 సిరీస్‌లో భాగంగా బ్రిస్బేన్‌లోని గబ్బా మైదానంలో ఈ రోజు తొలి టి-20 మ్యాచ్ జ‌ర‌గ‌నుంది.ఫించ్‌ నేతృత్వంలోని ఆసీస్ జ‌ట్టు భార‌త్ ఢీ కొన‌నుంది.ఇటీవలి కాలంలో మ్యాచ్‌కు ముందు రోజే జట్టును ప్రకటిస్తున్న టీమిండియా మరోసారి అదే పద్ధతి పాటించింది. ఓవైపు విరాట్‌ కోహ్లి సేన పూర్తిస్థాయి బలగంతో సంసిద్ధంగా ఉండగా, రాబోయే టెస్టు సిరీస్‌ను దృష్టిలో ఉంచుకుని ఆస్ట్రేలియా పలువురు ఆటగాళ్లకు విశ్రాంతినిచ్చింది. వెస్టిండీస్‌తో టి20 సిరీస్‌ నుంచి తప్పుకొన్న కెప్టెన్‌ కోహ్లి తిరిగి రావడంతో మనీశ్‌ పాండేను తప్పించింది.

ఓపెనర్లు రోహిత్‌ శర్మ, శిఖర్‌ ధావన్, కేఎల్‌ రాహుల్, దినేశ్‌ కార్తీక్, వికెట్‌ కీపర్‌ రిషభ్‌ పంత్‌లతో బ్యాటింగ్‌ దుర్బేధ్యంగా ఉంది. అయితే… ఇన్‌స్వింగర్లు, షార్ట్‌ బంతులతో రోహిత్‌ను పరీక్షించాలని ఆసీస్‌ భావిస్తోంది.ఇటీవల టి20ల్లో ఏ జట్టూ ఎదుర్కోనన్ని పరాజయాలను చవిచూసింది ఆస్ట్రేలియా. ఇంగ్లండ్, పాకిస్తాన్, దక్షిణాఫ్రికా చేతుల్లో ఓటమి పాలైంది. మ‌రి ఇలాంటి ప‌రిస్థితుల‌లో భార‌త్‌ను ఆస్ట్రేలియా జ‌ట్టు ఎలా ఎదుర్కొటుందో చూడాలి.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -