Thursday, May 16, 2024
- Advertisement -

విరాట్ కోహ్లీ బౌలింగ్ చేసినా ఫ‌లితం శూన్యం….

- Advertisement -

క్రికెట్ ఆస్ట్రేలియా ఎలెవన్ టీమ్‌‌తో జరుగుతున్న ప్రాక్టీస్ మ్యాచ్‌లో కోహ్లీ స్వ‌యంగా బౌలింగ్ చేశాడు. కాని అత‌నికి నిరాశె ఎదుర‌య్యింది. నాలుగు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్‌లో భాగంగా మూడో రోజైన శుక్రవారం 24/1తో తొలి ఇన్నింగ్స్‌ను కొనసాగించిన క్రికెట్ ఆస్ట్రేలియా.. 65.3 ఓవర్లు ముగిసే సమయానికి 234/6తో నిలిచింది.

క్రీజులో పాతుకుపోయిన హారీ నిల్సెన్ (56 బ్యాటింగ్: 106 బంతుల్లో 4×4), అరోన్ హార్డై (69 బ్యాటింగ్: 121 బంతుల్లో 8×4, 1×6) ఈరోజు ముగిసే వరకూ భారత్‌కి మరో వికెట్ ఇవ్వలేదు. కెప్టెన్ విరాట్ కోహ్లి బౌలర్లను మారుస్తూ.. ఆఖరి తను కూడా బౌలింగ్ చేసినా ఫలితం లేకపోయింది. దీంతో.. 102 ఓవర్లలో 356/6తో ఈరోజు ఆటని క్రికెట్ ఆస్ట్రేలియా ముగించింది. భార‌త్ మొద‌టి ఇన్నీంగ్స్‌లో 358 ప‌రుగుల‌కు ఆలౌట్ అయిన సంగ‌తి తెల‌సిందే. సుదీర్ఘ క్రికెట్ కెరీర్‌లో ఇప్పటి వరకు 73 టెస్టులాడిన విరాట్ కోహ్లి 27.1 ఓవర్లు బౌలింగ్ చేసి.. కనీసం ఒక వికెట్ కూడా పడగొట్టలేకపోయాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -