మహమ్మారి కరోనా కారణంగా అన్ని క్రీడా ఈవెంట్లు వాయిదా పడ్డ సంగతి తెలిసిందే. వైరస్ తీవ్రత తగ్గడం, వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో గత మూడు నెలలుగా మళ్లీ తిరిగి ప్రారంభమయ్యాయి. విదేశాల్లో కొంతమేర క్రికెట్ మ్యాచ్‌లను వీక్షించే అవకాశం అభిమానులకు కలిగినా, భారత్‌లో మాత్రం మైదానంలోకి ప్రేక్షకులను అనుమతించలేదు.
అయితే ఈరోజు చెన్నైలో ప్రారంభమైన ఇండియా వర్సెస్ ఇంగ్లండ్ రెండో టెస్టుకు మాత్రం 50 శాతం ఆడియెన్్సను స్టేడియంలోకి అనుమతినిస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. దీంతో దాదాపు ఏడాది విరామం తర్వాత క్రికెట్ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించే అవకాశం రావడంతో అభిమానులు చెపాక్ స్టేడియానికి పరుగెత్తారు. ఆరాధ్య క్రికెటర్ల ఆటనను కళ్లారా చూసేందుకు, సెలబ్రేషన్్స చేసుకునేందుకు జాతీయ జెండాలతో సిద్ధమయ్యారు. దీంతో చెపాక్ స్టేడియానికి కొత్త కళ వచ్చినట్లయింది.
చాలా కాలం తర్వాత టీమిండియా అభిమానులను మైదానంలో చూడటం ఆనందంగా ఉంది. చెపాక్ మైదానం కళకళలాడుతోంది అంటూ బీసీసీఐ ఓ వీడియోను షేర్ చేసింది. ఇందులో అభిమానులు ఉత్సాహంగా గడపటడటం కనిపించింది.ఇక మ్యాచ్ విషయానికొస్తే.. ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో లంచ్ విరామానికి ముందు భారత్ 3 వికెట్ల నష్టానికి 106 పరుగులు చేసింది. శుభ్‌మన్ గిల్, కోహ్లి, పుజారా అవుట్ అయ్యారు. రోహిత్ శర్మ, రహానే బ్యాటింగ్ చేస్తున్నారు.
Also Read
ప్రభావవంతమైన భారతీయుల్లో టాప్ లేపిన అల్లు అర్జున్
పెళ్లి పీటలు ఎక్కబోతున్న మహానటి !
వామ్మో విష్ణుప్రియ.. చూస్తే తట్టుకోలేరు..!
న్యూస్ పేపర్ డ్రెస్‌లో శ్రీముఖి అందాల హాట్ షో.. !