- Advertisement -
ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-11 సీజన్‌కు అట్టహాసంగా తెరలేచింది. శనివారం ముంబైలోని వాంఖేడే స్టేడియంలో లేజర్ కాంతుల మధ్య ఐపీఎల్ వేడుకలు కలర్‌ఫుల్‌గా ఆరంభమయ్యాయి. ఈ కార్యక‍్రమంలో సినీ స్టార్స్ హృతిక్ రోషన్, వరుణ్ ధావన్, ప్రభుదేవా, తమన్నా భాటియా, జాక్వలిన్ ఫెర్నాండేజ్‌లు ప‍్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
అంగరంగ వైభవంగా ఆరంభమైన వేడుకల్లో తమన్నా భాటియా తలుక్కుమంది. ఇక బాహుబాలి టైటిల్ సాంగ్‌తో ఎంట్రీ ఇచ్చిన తమన్నా.. ఓకే జాను పాటతో పాటు జై లవకుశలోని స్వింగ్ జరా పాటకు చిందేశారు. అద్భుత డ్యాన్స్‌తో ఆహుతలను, ప్రేక్షకులను మెస్మరైజ్ చేసింది.
రంగురంగుల దుస్తులతో పెద్ద బృందంతో కలసి తమన్నా డ్యాన్స్‌ను అదరగొట్టింది. ఆమె డ్యాన్ష్‌కు స్టేడియం అంతా నిండిపోయిన ప్రేక్షకులు ఆనందంతో నృత్యం చేశారు.