Friday, April 19, 2024
- Advertisement -

విజయ్‌ శంకర్‌కు ఎస్‌ఆర్‌హెచ్‌ విషెస్‌!

- Advertisement -

భారత క్రికెటర్‌ విజ‌య్ శంక‌ర్ ఓ ఇంటి వాడయ్యాడు. వైశాలి విశ్వేశ్వరను గురువారం అతను చెన్నెలో వివాహం చేసుకున్నాడు. గతేడాది ఆగస్టులో వీరి నిశ్చితార్థం జరిగింది. ఎలాంటి హడావుడి లేకుండా కొద్దిమంది కుటుంబస‌భ్యులు, స‌న్నిహితుల మ‌ధ్య ఈ పెళ్లి వేడుక నిర్వహించారు. విజయ్‌ శంకర్‌-వైశాలీ పెళ్లి ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసిన స‌న్‌రైజ‌ర్స్ బృందం నూతన వధూవరులకు శుభాకాంక్ష‌లు తెలిపింది. కాగా, విజయ్‌ శంకర్‌ ఐపీఎల్‌లో స‌న్‌రైజ‌ర్స్ తరపున ప్రాతినిథ్యం వహించిన సంగతి తెలిసిందే.

ఇక విజయ్‌ శంకర్‌-వైశాలీ దంపతులకు టీమిండియా ఆటగాళ్లు రాహుల్, చాహ‌ల్‌తో పాటు ప‌లువురు శుభాకాంక్ష‌లు తెలిపారు. 2018లో భారత క్రికెట్‌ జట్టులోకి ప్రవేశించిన విజయ్‌ శంకర్‌ ఆల్‌రౌండర్‌ కేటగిరీలో 2019 వరల్డ్‌ కప్‌లో చోటు సంపాదించాడు. ఇప్పటివరకు అతను 12 వన్డేలు, 9 టీ-20 మ్యాచ్‌లు ఆడాడు. ఐపీఎల్‌లో 40 మ్యాచుల్లో పాల్గొని 29.73 సగటుతో 654 పరుగులు చేశాడు. 8.43 ఎకానమితో 6 వికెట్లు తీశాడు.

స్టెప్పులేసిన వైస్‌ కెప్టెన్‌

ఏకగ్రీవాలైతే నష్టమేంటి?

అచ్చెన్నకు నోటీసులు

టాలీవుడ్ లో వీరి జోడీ సూపర్ హిట్..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -