ఐపీఎల్ తాజా సీజన్ లో కోల్‌కతా నైట్‌రైడర్స్ అదరగొడుతోంది. దినేష్ కార్తిక్ కెప్టెన్సీలో నైట్‌రైడర్స్ వరుస విజయాలను సాధిస్తుంది. ఆదివారం రాజస్తాన్ రాయల్స్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో అద్భుత విజయం సాధించింది. 8 వికెట్ల తేడాతో రాజస్తాన్ రాయల్స్‌పై నైట్‌రైడర్స్ విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన రాజస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 139 పరుగులు చేసింది. స్మిత్ ( 73) టోర్నిలో మొదటిసారి రాణించాడు.
అనంతరం 140 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన కోల్‌కతా నైట్‌రైడర్స్ 13.5 ఓవర్లలో 2 వికెట్లకు 140 పరుగులు చేసి గెలిచింది. లిన్ ( 50), నరైన్ (47) మెరుపు బ్యాటింగ్ తో తమ జట్టుకు విజయం సాధించిపెట్టారు. ఐపీఎల్‌లో తొలి మ్యాచ్ ఆడుతున్న హ్యారీ గర్నీ(2 వికెట్లు) ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు గెలుచుకున్నాడు. ఈ మ్యాచ్ విజయంతో నైట్‌రైడర్స్ నాలుగో విజయాన్ని నమోదు చేసింది.
- Advertisement -
రాజస్థాన్ పై అద్భుత విజయం సాధించిన కోల్‌కతా నైట్‌రైడర్స్
- Advertisement -
Related Articles
- Advertisement -
- Advertisement -
Latest News
- Advertisement -