ఐపీఎల్ 12వ సీజన్‌లో ధోని నాయకత్వంలోని చైన్నై సూపర్ కింగ్స్ జట్టు దూసుకుపోతోంది. టోర్నీలో వరుసుగా రెండో విజయాన్ని నమోదు చేసింది. మంగళవారం ఫిరోజ్ షా కోట్లా పిచ్‌పై జరిగిన మ్యాచ్‌లో చెన్నై 6 వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఓడించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. శిఖర్ ధావన్ (51) మరోసారి అర్థ సెంచరీతో రాణించాడు.
శిఖర్ ధావన్ మినహా మిగతా బ్యాట్స్‌మెన్ చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడలేకపోయారు. 147 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన చైన్నై సూపర్ కింగ్స్ జట్టుకు శుభారంభం దక్కింది. వాట్సన్ ( 44) , రైనా ( 30) రాణించి తమ జట్టుకు విజయాన్నిందించారు. చెన్నై 19.4 ఓవర్లలో 4 వికెట్లకు 150 పరుగులు చేసి విజయాన్నందుకుంది. మ్యాన్ ఆప్ ది మ్యాచ్ చెన్నై బ్యాట్స్‌మెన్ వాట్సన్‌కు దక్కింది. ఈ మ్యాచ్ విజయంతో మరో రెండు పాయింట్లను తన ఖాతాలో వేసుకుంది చైన్నై సూపర్ కింగ్స్ జట్టు.
- Advertisement -
చైన్నై సూపర్ కింగ్స్ ఖాతాలో మరో విజయం
- Advertisement -
Related Articles
- Advertisement -
- Advertisement -
Latest News
- Advertisement -