Wednesday, May 7, 2025
- Advertisement -

కోహ్లీని అంత‌ర్జాతీయ క్రికెట్‌నుంచి బ‌హిస్క‌రించాలి…

- Advertisement -
Kamaal R Khan fire on Virat Kohli

ఐసీసీ ఛాంపియ‌న్స్ ట్రోఫీ ఫైన‌ల్లో దాయాది పాకిస్థాన్‌చేతిలో భార‌త్ ఘోర‌ప‌రాభ‌వం ఎదుర్కొంది.ఇప్ప‌టికే టీమిండియాపై నెటిజ‌న్లు మండిప‌డుతున్నారు.ఇప్పుడు కొత్త‌గా మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోప‌న‌లు వెల్లువెత్తాయి.

వివాదాలతో వార్తల్లో నిలిచే బాలీవుడ్ నటుడు, విమర్శకుడు కమల్ రషీద్ ఖాన్ సంచ‌ల‌న వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు.
చాంపియన్స్‌ ట్రోఫీ ఫైనల్లో పాకిస్తాన్‌ చేతిలో భారత జట్టు ఘోరం​గా ఓడిపోవడంతో కేఆర్‌కే తీవ్ర ఆరోపణలు, వ్యాఖ్యలు చేశాడు. కోహ్లిని అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి బహిష్కరించాలని డిమాండ్‌ చేశాడు. మ్యాచ్‌ ఫిక్సింగ్‌కు పాల్పడ్డాడని ఆరోపించాడు. అతడిని జైలుకు పంపాలని అన్నాడు.

{loadmodule mod_custom,GA1}

సోదరా కోహ్లి.. నీవు ఇచ్చిన క్యాచ్‌ పాకిస్తాన్‌ ఫీల్డర్లు వదిలేశారు. తర్వాతి బంతికే సులువైన క్యాచ్‌ ఇచ్చి అవుటయ్యావు. నువ్వు ఫిక్సింగ్‌కు పాల్పడ్డావని క్లియర్‌గా అర్థమవుతోంది. 130 కోట్ల మంది భార‌తీయుల ఆత్మ‌గౌర‌వాన్ని పాకిస్థాన్ ముందు తాక‌ట్టుపెట్టావ‌నీ తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు.
కోహ్లితో పాటు యువరాజ్‌ సింగ్‌, ఎంఎస్‌ ధోని కూడా ఫిక్సింగ్‌కు పాల్పడ్డారు. మీరందరూ ఫిక్సర్లు. ప్రజలను మోసం చేయడం మానుకోవాల’ని ట్వీట్‌ చేశాడు.ఆరోపణలు చేసిన కేఆర్‌కేపై టీమిండియా, పాకిస్తాన్‌ అభిమానులు తీవ్రంగా స్పందించారు. ఆటను ఆటలా చూడాలని, అనవసర ఆరోపణలు చేయొద్దని హితవు పలికారు.

{loadmodule mod_custom,GA2}

Also read

  1. విరాట్‌ కోహ్లి ఔట్ కావడానికి కారణం ఏంటి..?
  2. బంగ్లాపై 9 వికెట్ట తేడాతో ఘ‌న‌విజయం సాధించిన ఇండియా… ఫైన‌ల్లో విరాట్ సేన‌
  3. వన్డే బ్యాట్స్‌మెన్‌ ర్యాంకింగ్స్ ఫ‌లితాల‌ను ప్ర‌క‌టించిన ఐసీసీ
  4. చాంపియన్స్ ట్రోఫీలో అత్యధిక సెంచరీ భాగస్వామ్యాలు నమోదు చేసిన జోడిగా రికార్డు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -