Tuesday, May 21, 2024
- Advertisement -

వన్డే బ్యాట్స్‌మెన్‌ ర్యాంకింగ్స్ ఫ‌లితాల‌ను ప్ర‌క‌టించిన ఐసీసీ

- Advertisement -
Virat Kohli reclaims top spot in ICC announced ODI rankings

ఐసీసీ తాజాగా విడుదల చేసిన వన్డే బ్యాట్స్‌మెన్‌ ర్యాంకింగ్స్‌లో భారత క్రికెట్‌ జట్టు సారథి విరాట్‌ కోహ్లీ అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నాడు.కోహ్లి 862 రేటింగ్ పాయింట్లలతో అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు.

చాంపియన్స్ ట్రోఫీలో పాకిస్తాన్, దక్షిణాఫ్రికాలతో జరిగిన వన్డే మ్యాచ్ ల్లో హాఫ్ సెంచరీలు చేసిన కోహ్లి 22 పాయింట్లను సాధించాడు.రెండో స్థానంలో ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్(861) నిలిచాడు.
ఫిబ్రవరి నుంచి వన్డేల్లో నంబర్ వన్ ర్యాంకులో కొనసాగిన డివిలియర్స్.. చాంపియన్స్ ట్రోఫీలో పేలవమైన ప్రదర్శన కనబరిచాడు. దాంతో రేటింగ్ పాయింట్లను కోల్పోయి మూడో స్థానానికి పడిపోయాడు. మరొకవైపు జనవరి నెలలో నాలుగు రోజులు మాత్రమే టాప్ ర్యాంకును ఎంజాయ్ చేసిన కోహ్లి.. ఇప్పుడు ఎంతకాలం ఆ ర్యాంకులో కొనసాగుతాడో చూడాలి.కాగా, టాప్ -10లో మరో భారత బ్యాట్స్మన్ శిఖర్ ధావన్ చోటు దక్కించుకున్నాడు.

{loadmodule mod_custom,Side Ad 1}

టాప్‌-10 వన్డే బౌలర్ల జాబితాలో భారత్‌కు చెందిన ఏ ఒక్కరికి చోటు దక్కలేదు. ఆస్ట్రేలియాకి చెందిన హేజిల్‌వుడ్‌ అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. అక్షర్‌ పటేల్‌, అమిత్‌ మిశ్రా రెండేసి పాయింట్లు కోల్పోయి 13, 15 స్థానాల్లో కొనసాగుతున్నారు.
ఆల్‌రౌండర్ల జాబితాలో టాప్‌-10లో ఒక్క రవీంద్ర జడేజాకి మాత్రమే చోటు దక్కింది. జడేజా 254పాయింట్లతో 8వ స్థానంలో ఉన్నాడు. బంగ్లాదేశ్‌కి చెందిన షకిబ్‌ ఆల్‌ హాసన్‌ ఆల్‌రౌండర్ల జాబితాలో అగ్రస్థానంలో నిలిచాడు.

{loadmodule mod_custom,Side Ad 2}

Related

  1. సెమీఫైన‌ల్‌లో భార‌త్ వ‌ర్సెస్ బంగ్లా..
  2. చాంపియన్స్ ట్రోఫీలో అత్యధిక సెంచరీ భాగస్వామ్యాలు నమోదు చేసిన జోడిగా రికార్డు
  3. ఇండియ‌న్ క్రికెట్ టీమ్ కోచ్ కోసం వేట ప్రారంభించిన బీసీసీఐ
  4. టెస్ట్ ర్యాంకింగ్ ఫ‌లితాల‌ను విడుద‌ల చేసిన ఐసీసీ

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -