Saturday, May 18, 2024
- Advertisement -

బంగ్లాపై 9 వికెట్ట తేడాతో ఘ‌న‌విజయం సాధించిన ఇండియా… ఫైన‌ల్లో విరాట్ సేన‌

- Advertisement -
India Vs Pakistan in icc champions trophy 2017 Final Match

పాక్‌,ఇండియా జట్ల‌మ‌ధ్య క్రికెట్ అంటె అభిమానుల‌కు పండుగే. ఇప్పుడు మ‌రోసారి దాయాదుల స‌మ‌రానికి రంగం సిద్ద‌మ‌య్యిది.చాంపియన్స్ ట్రోఫీలో మరో అనూహ్య ఫలితం. లీగ్ దశలో వరుస విజయాలతో దుమ్మురేపిన ఇంగ్లండ్ జట్టుకు సొంతగడ్డపై ఘోర పరాభవం.

టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగినా.. కీలక మ్యాచ్‌లో మాత్రం బ్యాటింగ్ వైఫల్యంతో వెనుకడుగు వేసింది. దీంతో బుధవారం జరిగిన సెమీఫైనల్లో పాకిస్థాన్ 8 వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌ను చిత్తు చేసి దర్జాగా టైటిల్ పోరుకు దూసుకెళ్లింది.

{loadmodule mod_custom,GA1}

సెకెండ్ సెమీఫైన‌ల్లో ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫీలో బంగ్లాదేశ్‌తో జరుగుతున్న సెమీస్‌లో టీమిండియా దుమ్మురేప‌కింది. భారత్‌ బ్యాట్స్‌మెన్‌ తమ అద్భుత బ్యాటింగ్‌తో ప్రత్యర్థిని బెంబేలెత్తిస్తున్నారు. బంగ్లా పై భార‌త్ ఘ‌న‌విజ‌యం సాధించి ఫైన‌ల్‌కు దూసుకెల్లింది.
బంగ్లాదేశ్ విసిరిన 265 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన భారత్ జట్టుకు శుభారంభం లభించింది. రోహిత్ శర్మ(123 ; 129 బంతుల్లో 15 ఫోర్లు, 1 సిక్సు నాటౌట్) అజెయ సెంచరీ, కెప్టెన్ విరాట్ కోహ్లివిరాట్ కోహ్లి(96; 78 బంతుల్లో 13 ఫోర్లు) లు రాణించడంతో భారత్ విజయం సులువైంది.

{loadmodule mod_custom,GA2}

అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 264 పరుగులు చేసింది.బంగ్లాదేశ్ తో జరిగిన సెమీ ఫైనల్లో భారత్ జట్టు 9 వికెట్ల తేడాతో విజయం సాధించి తుదిపోరుకు అర్హత సాధించింది. 18 న‌జ‌రిగే ఫైన‌ల్లో దాయాదులు పాక్‌,భార‌త్ త‌ల‌ప‌డ‌నుంది.ఇది అభిమానుల‌కు పండ‌గే..

{loadmodule mod_sp_social,Follow Us}

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -