Friday, May 10, 2024
- Advertisement -

చాంపియన్స్ ట్రోఫీలో అత్యధిక సెంచరీ భాగస్వామ్యాలు నమోదు చేసిన జోడిగా రికార్డు

- Advertisement -
Rohit Sharma and Shikhar Dhawan extend opening record in ICC Champions Trophy 2017

చాంపియన్స్ ట్రోఫీలో భారత ఓపెనింగ్ జోడి రోహిత్ శర్మ-శిఖర్ ధావన్ల జోడి మరోసారి మెరిసింది.ఈమ్యాచ్‌లో ఇద్ద‌రూ సెంచ‌రీ బాగస్వామ్యాన్ని న‌మోదు చేశారు.దీంతో ఈటోర్నీలో అత్య‌ధిక సార్లు సెంచరీ భాగస్వామ్యాలు(నాలుగుసార్లు) నమోదు చేసిన రికార్డును మరింత మెరుగుపరుచుకుంది.

పాకిస్తాన్ తో జరిగిన గత మ్యాచ్ లో వీరిద్దరూ 136 పరుగులు సాధించి చాంపియన్స్ ట్రోఫీలో మూడుసార్లు సెంచరీ భాగస్వామ్యాలు నమోదు చేసిన సంగతి తెలిసిందే.
చాంపియన్స్ ట్రోఫీలో అత్యధిక సెంచరీ భాగస్వామ్యాలు నమోదు చేసిన జోడిగా రికార్డు సృష్టించింది. అయితే తాజాగా లంకేయులతో మ్యాచ్లో సైతం సెంచరీ భాగస్వామ్యాన్ని సాధించడంతో ఈ ఘనతను నాల్గోసారి తన ఖాతాలో వేసుకుంది.

{loadmodule mod_custom,Side Ad 1}

ఈ మ్యాచ్ లో రోహిత్ శర్మ 58 బంతుల్లో 4 ఫోర్లు, 1సిక్సర్ సాయంతో హాఫ్ సెంచరీ సాధించాడు. ఇక్కడ రోహిత్ సిక్సర్ తో హాఫ్ సెంచరీ మార్కును చేరడం విశేషం. అంతకుముందు పాకిస్తాన్ తో మ్యాచ్ లో కూడా సిక్సర్ తోనే రోహిత్ శర్మ అర్థశతకం నమోదు చేశాడు. మరోవైపు శిఖర్ ధావన్ 69 బంతుల్లో 6 ఫోర్ల సాయంతో హాఫ్ సెంచరీ చేశాడు. ఈ జోడి 138 పరుగుల భాగస్వామ్యాన్ని సాధించింది.

Related

  1. భార‌త్ …పాక్ మ్యాచ్‌ను తిల‌కించిన విజ‌య్ మాల్యా
  2. సచిన్‌- ఎ బిలియన్‌ డ్రీమ్స్ సినిమాకు రూ.40 కోట్లు పారితోషికం తీసుకున్న స‌చిన్‌
  3. సీమాంత‌ర ఉగ్ర‌వాదానికి పాక్ స్వ‌స్తి ప‌ల‌కాలి…
  4. ఇండియ‌న్ క్రికెట్ టీమ్ కోచ్ కోసం వేట ప్రారంభించిన బీసీసీఐ

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -