Thursday, May 8, 2025
- Advertisement -

ధోనీపై మ‌రోసారి త‌న అభిమానాన్ని చాటుకున్న పాక్ వీరాభిమాని…

- Advertisement -

మహేంద్ర సింగ్ ధోనీ… కెప్టెన్‌గా, క్రికెటర్‌గా టీమిండియాకు ఎన్నో చిరస్మరణీయ విజయాలను అందించాడు. ఇక ఎంఎస్‌కు ఉండే ఫ్యాన్స్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దాయాదిదేశం పాకిస్థాన్‌లోకూడా ధోనీకి వీరాభిమాని ఉన్నాడు.అతడికి మహేంద్రుడంటే ఎంత అభిమానమో మ‌రో సారి చాటుకున్నాడు.

తన భార్యకంటే ధోనీ అంటేనే ఎక్కువ ఇష్టమని చెప్పారు. ఇలా తన అభిమాన క్రికెటర్‌ను ఆరాదించడానికి ఓ కారణం కూడా ఉందట. ఆ అభిమాని పేరు బషీర్. ఇప్పుడతను ట్రై సిరీస్ మ్యాచ్‌లు చూసేందుకు శ్రీలంక వెళ్లాడు. అక్కడ మీడియాతో చిట్‌చాట్‌గా మాట్లాడుతూ ఈ విషయాలను చెప్పుకొచ్చాడు.

బషీర్ 2011లో ప్రపంచకప్‌లో భాగంగా భారత్‌-పాకిస్థాన్ ‌మధ్య మొహాలీలో ఓ సెమీఫైనల్‌ జరిగింది. ఈ మ్యాచ్‌ చూసేందుకు అతడు పాక్ నుంచి రెండు మూడు రోజులు ముందుగానే వచ్చాడు. టిక్కెట్‌ కోసమని గ్రౌండ్ దగ్గరకు వెళ్లగా… అప్పటికే టిక్కెట్లు అయిపోవ‌డంతో నిరాశతో తిరిగి వెళ్లిపోదామనుకున్నాడు. అయితే ఎలాగైనా మ్యాచ్‌ చూడాలన్న బలమైన కోరిక కలిగింది.

మరోసారి టికెట్‌కోసం తర్వాతి రోజు మరోసారి స్టేడియానికి వచ్చాడు. అప్పుడు కూడా అత‌నికి నిరాశ త‌ప్ప‌లేదు. అయితే ఇంతలో ఒక వ్యక్తి ఏదో కవరు చేతపట్టుకుని వచ్చి అతడికి ఇచ్చాడు. దాన్ని తీసి చూడగానే షాకయ్యాడు. అందులో మ్యాచ్ టిక్కెట్లు ఉన్నాయి. అవి ధోనీ పంపించారని తెలుసుకున్నాడు. బషీర్ ఎవరో కూడా ఎంఎస్‌కు తెలియదు… కాని టిక్కెట్లు పంపించాడు.

ఆ మ్యాచ్ దగ్గర నుంచి ధోనీ అంటే అభిమానం పెరిగిందట. ఎంతంటే తన భార్య కన్నా ఎక్కువగా అని చెప్పి నవ్వుతుంటాడు బషీర్.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -