Friday, May 3, 2024
- Advertisement -

అభినందన్ ను పట్టుకున్న పాక్ కమాండ్ ర్ ను హతమార్చిన బద్రతా దళాలు..

- Advertisement -

పుల్వామా ఉగ్రదాడి తర్వాత బాలాకోట్ లోని ఉగ్రవాద శిబిరాలపై ఇండియణ్ ఎయిర్ ఫోర్స్ దాడులు చేసిన సంగతి తెలిసిందే. ఆతర్వాత పాక్ కూడా భారత్ పై యుద్ధ విమానాలతో దాడికి దిగిన వచ్చిన సంయంలో పాక్ కు చెందిన యుద్ధ విమానాలను తరిమికొట్టే క్రమంలో ఐఏఎఫ్ వింగ్ కమాండర్ అభినందన్‌ ప్రమాదవశాత్తూ పాక్ గడ్డపై దిగిన విషయం తెలిసిందే.

అభినందన్ నడిపిన ఐఏఎఫ్‌ మిగ్-21 బైసన్ జెట్‌.. పాక్‌కు చెందిన ఎఫ్-16 యుద్ధ విమానాన్ని కూల్చి సరిహద్దు సమీపంలో పాక్ భూ భాగంలో కూలిపోయింది. అదే సమయంలో ఐఏఎఫ్‌ మిగ్-21 ప్రమాదానికి గురి అవడంతో ప్యారాచూట్ సహాయంతో పాక్ భూభాగంలో దిగారు.దీంతో అభినందన్ పాక్‌ సైన్యానికి పట్టుబడ్డారు.

అభినందన్ విమానం పీఓకేలో కూలిన సమయంలో అహ్మద్ ఖాన్ అనే కమాండో పాకిస్థాన్ లో హీరో అయ్యాడు. పాకిస్థాన్ సైన్యంలో స్పెషల్ సర్వీసెస్ గ్రూప్ కమాండోగా విదులు నిర్వర్తిస్తున్న అహ్మద్ ఖాన్ తమ భూభాగంలో అడుగిడిన అభినందన్ ను అదుపులోకి తీసుకున్నాడు.నాడు విడుదలైన ఫోటోల్లో అభినందన్ వెనుక గడ్డంతో ఉన్న వ్యక్తి అతడే.

అతడిని ప్రత్యేకంగా భారత్‌లోకి చొరబాట్లను ప్రోత్సహించడానికి నియమించినట్లు తెలుస్తోంది. నౌషెరా, సుందర్‌బనీ, పల్లన్ వాలా సెక్టార్లలో అతడు విధులు నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఆర్టికల్ 370 ని రద్దు చేయడంతో రగిలిపోతున్న పాక్ భారత్ లోకి ఉగ్రవాదులను పంపించేందుకు ప్రయత్నింస్తుండగా …ఇండియన్ ఆర్మీ జరిపిన కాల్పుల్లో అహ్మద్ ఖాన్ హతమయ్యారు. పాక్‌ నుంచి ఉగ్రవాదులను భారత్‌కు అక్రమంగా తరలించేందుకు అహ్మద్‌ ఖాన్‌ కీలకంగా వ్యవహరించేవాడని తెలుస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -