Friday, May 17, 2024
- Advertisement -

పాక్ విజ‌యంపై కెప్టెన్ స‌ర్ప‌రాజ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు…

- Advertisement -

ప్ర‌పంచ‌క‌ప్ నుంచి ఇప్ప‌టికే పాక్ అన‌ధికారికంగా వైదొల‌గింది. అయితే సెమీస్ రేస్ కు మాత్రం కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతోంది. పాక్ సెమీస్ వెల్లేదానికి దారుల‌న్ని మూసుకుపోయినా బంగ్లాపై భారీ విజ‌యం సాధించాల‌ని ప‌ట్టు ద‌ల‌తో ఉంది. అద్భుతం జరిగితే తప్ప పాక్ సెమీస్ కు చేరలేదు. అయితే, పాకిస్థాన్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ మాత్రం సెమీస్ కచ్చితంగా చేరుతామనే దీమాతో ఉన్నాడు.

మంగ్లాపై 500 ప‌రుగులు చేస్తామ‌ని ధీమా వ్య‌క్తం చేశారు. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో పాకిస్థాన్ 9 పాయింట్లతో ఐదో స్థానంలో ఉంది. పట్టికలో నాలుగో స్థానంలో ఉన్న న్యూజిలాండ్ ను వెనక్కి నెట్టిస… సెమీస్ బర్త్ సాధించాలంటే బంగ్లాదేశ్ తో జరిగి మ్యాచ్ లో 450కి పైగా ప‌రుగులు సాధించాలి. బంగ్లాను 316 పరుగుల తేడాతో ఓడించాలి. ఇప్ప‌టి వ‌ర‌కు ఇలాంటి ఘ‌ట‌న పున‌రావృతం కాలేదు.

ఈ మ్యాచ్ లో టాస్ కూడా అత్యంత కీలకం కాబోతోంది. టాస్ గెలిచి బంగ్లాదేశ్ తొలుత బ్యాటింగ్ తీసుకుంటే… పాకిస్థాన్ కథ ముగిసినట్టే. 316 పరుగులతో పాకిస్థాన్ గెలవాలంటే… బంగ్లాదేశ్ ఎన్ని పరుగులు చేయాల్సి ఉంటుందో మనం ఊహించుకోవచ్చు. ఇప్పటి వరకు వన్డేల్లో ఒక జట్టు సాధించిన అత్యధిక స్కోరు 481 పరుగులు మాత్రమే. వీటిన్నింటిని దృష్టిలో పెట్టుకుని మాట్లాడిన సర్ఫరాజ్… 500 పరుగులు చేసేందుకు ప్రయత్నిస్తామని, బంగ్లాదేశ్ ను 50 పరుగులకే ఆలౌట్ చేసేందుకు కృషి చేస్తామని చెప్పాడు. అయితే అద్భుతం జరిగి సెమీస్‌కు వెల్తుందో లేదో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -