క్రికెట్‌లో రికార్డులు ఎప్పటికప్పుడు చెరిగిపోతుంటాయి. రికార్డులు శాశ్వతం కాదు. అయితే ఇప్పటివరకు క్రికెట్‌లో ఎన్నో విధ్వంసకర ఇన్నింగ్స్ చూసి ఉంటారు. కాని ఇలాంటి విధ్వంసకర బ్యాటింగ్ చూసిండరు. ఇప్పటివరకు బయటి ప్రపంచానికి ఊరూ పేరూ తెలియని ఓ 20 ఏళ్ల ఇంగ్లండ్ యువకుడు క్రికెట్ ఫీల్డ్‌లో ఈ పెను విధ్వంసం సృష్టించాడు. అతని పేరు విల్ జాక్స్. దుబాయ్ వేదికగా జరిగిన టీ10 మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగిన జాక్స్ కేవలం 25 బంతుల్లోనే సెంచరీ బాదేశాడు. ఎనిమిది ఫోర్లు, పదకొండు సిక్సర్లతో చెలరేగి ఆడాడు. ఈ క్రమంలోనే ఒక ఓవర్‌లో ఆరు సిక్సర్లు కొట్టి ఔరా అనిపించాడు. జాన్స్ జోరుతో తొలుత బ్యాటింగ్ చేసిన సర్రే జట్టు నిర్ణీత 10 ఓవర్లలో 3 వికెట్ల నస్టానికి 176 పరుగులు చేసింది. అనంతరం భారీ లక్ష్యఛేదనలో తడబడిన లాన్‌షైర్ 9.3 ఓవర్లలోనే 81 పరుగులకి ఆలౌటైంది. ఫలితంగా సర్రే జట్టు 95 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది.
- Advertisement -
ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ విధ్వంసకర బ్యాటింగ్..25 బంతుల్లోనే సెంచరీ
- Advertisement -
Related Articles
- Advertisement -
- Advertisement -
Latest News
- Advertisement -