Saturday, May 4, 2024
- Advertisement -

కోహ్లీ కౌంటీల్లో ఆడ‌టంపై క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ..

- Advertisement -

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి కౌంటీ క్రికెట్‌కు దూరమయ్యాడు. సర్రే తరఫున కౌంటీలు ఆడాల్సి ఉండగా.. మెడ గాయం కారణంగా కోహ్లి ఆడటం లేదని బీసీసీఐ ప్రకటించింది. సర్రే తరఫున కౌంటీల్లో ఆడటం ద్వారా ఇంగ్లాండ్ పర్యటనకు సన్నద్ధం కావాలని కోహ్లి భావించిన కోహ్లీ సర్రేతో ఒప్పందం కాంట్రాక్ట్ కుదుర్చుకున్న సంగ‌తి తెలిసిందే.

అయితే తాజాగా కైంటీమ్యాచ్‌ల‌కు దూరం అయ్యారు. పీఎల్‌లో భాగంగా బెంగళూరులో సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్ సందర్భంగా విరాట్ గాయపడ్డాడని బోర్డు తెలిపింది. స్కానింగ్, ఇతర వైద్య పరీక్షల అనంతరం మెడికల్ టీం ఈ విషయాన్ని నిర్ధారించిందని బీసీసీఐ స్పష్టం చేసింది.

ఇంగ్లాండ్ వాతావరణానికి అలవాటు పడేందుకు.. సర్రే కౌంటీ క్రికెట్ క్లబ్ తరఫున మూడు లిస్ట్ ఏ, మూడు ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడేందుకు కోహ్లి ఒప్పందం చేసుకున్నాడు. జూలై మొదటి వారంలో భారత జట్టు ఇంగ్లాండ్‌లో టీ20 మ్యాచ్‌లు ఆడనుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -