Friday, May 3, 2024
- Advertisement -

కోహ్లీ కూడా మ‌నిషే..ప‌రుగుల యంత్రం కాదు…

- Advertisement -

మెడకు సంబంధించిన గాయం కారణంగా ఇంగ్లండ్ కౌంటీల్లో ఆడాలనే టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కల నెరవేరలేదు. సర్రే టీమ్ నుంచి ఆయన తప్పుకున్నాడు. కోహ్లీ నిర్ణయంతో భారతీయ అభిమానులే కాకుండా, కోహ్లీ ఆటను ఆస్వాదించాలనుకున్న ఇంగ్లండ్ లోని అభిమానులు కూడా నిరాశకు గురయ్యారు.

దీనిపై కోచ్ వ‌రిశాస్త్రి స్పందించారు. కోహ్లీ యంత్రం కాదని, ఆయన కూడా ఒక మనిషే అని గుర్తుపెట్టుకోవాలని చెప్పాడు. వెనుక నుంచి రాకెట్ ఇంధనాన్ని ఉంచి అతణ్ని మైదానంలోకి పంపలేం కదా.. అంటూ శాస్త్రి ఒకింత సహనంగా మాట్లాడాడు. కోహ్లి టాప్ డాగ్ అంటూ ఇంగ్లాండ్ ఆటగాడు మొయిన్ అలీ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్‌గా.. అతడు టాప్ డాగ్ కాదంటూ శాస్త్రి కామెంట్ చేశాడు.

ఈనెల 17న రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు-సన్ రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య జరిగిన ఐపీఎల్ మ్యాచ్ లో ఫీల్డింగ్ సందర్భంగా కోహ్లీ గాయపడ్డ సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా విరాట్ మెడకు ఇంజ్యూరీ అయింది. జూన్ 15వ తేదీన బెంగుళూరులో ఉన్న నేషనల్ క్రికెట్ అకాడమీలో కోహ్లీ ఫిట్ నెస్ టెస్టుకు హాజరుకానున్నాడు. అక్కడ ఫిట్ నెస్ ను నిరూపించుకుంటే… ఐర్లాండ్, ఇంగ్లండ్ టూర్ కు టీమిండియాతో కలిసి బయల్దేరుతాడు

కోహ్లికి గాయం కావడం పట్ల సర్రే జట్టు యాజమాన్యం తీవ్ర నిరాశ వ్యక్తం చేసింది. విరాట్ కౌంటీల్లో ఆడితే చూడాలని అభిమానులు ఎంతో ఆశించారు. కానీ బీసీసీఐ మెడికల్ టీం తీసుకున్న నిర్ణయాన్ని మేం గౌరవిస్తామని సర్రే డైరెక్టర్ అలెక్ స్టెవార్ట్ తెలిపారు. కోహ్లి సర్రే తరఫున ఆడటం లేదని ఆ జట్టు ప్రకటించగానే.. అతడి ఆట చూడటం కోసమే టికెట్లు కొనుగోలు చేశాం. డబ్బులు వెనక్కి ఇచ్చేస్తారా..? అని సర్రే క్రికెట్ క్లబ్ హోం పేజీలో కొందరు కామెంట్ పోస్ట్ చేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -