- Advertisement -
ఇంగ్లాండ్‌తో టీ20 సిరీస్‌కు జట్టును ప్రకటించింది బీసీసీఐ. ఈనెల 22 నుంచి టీ20 సిరీస్ ప్రారంభంకానుంది. ఈ సిరీస్‌కు సూర్యకుమార యాదవ్ కెప్టెన్‌గా వ్యవహారించనుండగా 15 మందితో జట్టును ప్రకటించింది.
సుదీర్ఘ కాలం తరువాత మహ్మద్ షమీ టీమిండియా జట్టులోకి రీఎంట్రీ ఇచ్చాడు. దాదాపు 14నెలల తర్వాత షమీ జట్టులో చేరాడు. అలాగే ఆల్ రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డికి టీ20 జట్టులో చోటు దక్కింది. వైస్ కెప్టెన్‌గా అక్షర్ పటేల్‌కు ఛాన్స్ ఇచ్చారు. శుభ్‌మన్ గిల్‌కు నిరాశే మిగిలింది.
టీ20 జట్టు ఇదే:
సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అక్షర్ పటేల్ (వైస్ కెప్టెన్), సంజు శాంసన్, తిలక్ వర్మ, అభిషేక్ శర్మ, హార్దిక్ పాండ్య, రింకు సింగ్, నితీశ్ కుమార్ రెడ్డి, హర్షిత్ రాణా, అర్ష్ దీప్ సింగ్, మహ్మద్ షమీ, వరున్ చక్రవర్తి, రవి బిష్ణోయ్, వాసింగ్టన్ సుందర్, ధ్రువ్ జురెల్.