Saturday, April 27, 2024
- Advertisement -

విరాట్ స్థానంలో సూర్యకుమార్?

- Advertisement -

ఈ ఏడాది జూన్‌లో టీ20 వరల్డ్ కప్ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. వెస్టిండీస్ – అమెరికా వేదికగా ఈ మెగా టోర్నీ జరగనుండగా ఈసారి ఏకంగా 20 టీమ్‌లు పాల్గొంటున్నాయి. ఈసారి ఎలాగైనా టోర్నిని దక్కించుకోవాలని పట్టుదలతో ఉంది భారత్. ఎందుకంటే 2019లో టీ20 వరల్డ్ కప్‌లో సెమీస్‌లోనే ఇంటి ముఖం పట్టగా గతేడాది జరిగిన వన్డే ప్రపంచకప్‌లో ఫైనల్లో ఓటమి పాలైంది టీమిండియా.

ఈ నేపథ్యంలో భారత టీమే కాదు ఫ్యాన్స్ సైతం టీ 20 వరల్డ్ కప్‌ టీమిండియా గెలవాలని కోరుకుంటున్నారు. అయితే జట్టు కూర్పు ఎలా ఉండనుందోనన్న టెన్షన్ మాత్రం అందరిలో నెలకొంది. ఎందుకంటే స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీకి ఈ సారి టీ20 వరల్డ్ కప్‌లో చోటు దక్కుతుందా లేదా అన్న సందేహం వ్యక్తమవుతోంది. ఎందుకంటే టీ20ల్లో పెద్దగా ఆకట్టుకోలేదు విరాట్. అందుకే యువ ఆటగాళ్లను బరిలోకి దించేందుకు కసరత్తు చేస్తోంది టీమిండియా.

ఫార్మాట్ ఏదైనా బ్యాటింగ్‌ ఆర్డర్‌లో మూడో స్థానం విరాట్‌దే. అయితే ఒకవేళ కోహ్లీని ఎంపిక చేయకపోతే ఆ స్థానాన్ని సూర్యకుమార్ భర్తీ చేసే అవకాశం ఉంది. టీ20 ఫార్మాట్ లో సూర్య కుమార్ యాదవ్ నెంబర్ ఒన్ బ్యాట్స్ మెన్ గా ఉన్నాడు. అందుకే సూర్యను బ్యాటింగ్‌ ఆర్డర్‌లో ప్రమోట్ చేసే ఛాన్స్‌ ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -