- Advertisement -

ప్రభుత్వంలో కనిపించని ప్రాయశ్చిత్తం!

- Advertisement -

తిరుపతి తొక్కిసలాట సందర్భంగా జరిగిన దుర్ఘటన తర్వాత కూడా ప్రభుత్వంలో ప్రాయశ్చిత్తం కనిపించడం లేదన్నారు మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి. మంత్రి ఆనం రామనారాయణరెడ్డి మాపై చేసిన ఆరోపణలు దారుణంగా ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.

మీ నిర్వాకం వల్ల 6గురు మరణిస్తే, నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాల్సింది పోయి, జగన్‌ పై ఆరోపణలు చేయడం సరికాదన్నారు. తొక్కిసలాట బాధితులపై సానుభూతి చూపాల్సింది పోయి, పరామర్శించి ఆర్ధిక సాయం చేయాల్సింది పోయి, మేం డబ్బులిచ్చి మిమ్మల్ని తిట్టించడానికి వాడుకున్నామనడం రాజకీయం కాదా? చెప్పాలని డిమాండ్ చేశారు.

మాజీ ముఖ్యమంత్రి వస్తుంటే ట్రాక్టర్లు అడ్డుపెట్టి అడ్డుకోవాలనుకోవడం దారుణం కాదా? చెప్పాలన్నారు. తొక్కిసలాట క్షతగాత్రులతో తిట్టించడానికి డబ్బులు ఇచ్చామని ఆరోపించడం సరికాదా అన్నారు. ఆనం దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నా పార్టీలో ఎవరూ గుర్తించడం లేదు అని దుయ్యబట్టారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -